kunaram Rice: ఎం.టీ.యు 1010ని తల్లిగా ఉపయోగించి రూపొందించిన స్వల్పకాలిక సన్న గింజ రకం కూనారం రైస్ 1 రకం తెలంగాణాలో అధిక ప్రాచుర్యం పొందుతున్న సందర్భంలో చాలా మంది రైతులు దీని సాగు గురించిన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రకారం ఈ రకం ఎం.టీ.యు 1010 మరియు జె.జి.యల్ 11470ని సంకరణం చేయగా వెలువడినది. ఇది వర్షాకాలం లో దాదాపు 120-125 రోజుల పంటకాలమును కలిగి ఉంటుంది. అదే యాసంగిలో అయితే 130 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 26-32 క్వింటాళ్ల ఇస్తుంది. ఇంకా అధిక దిగుబడి సాధించడానికి ఈ కింది యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలి.
ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమవును.3 గ్రాములు ఒక కిలోకి చొప్పున కార్బెన్డిజిమ్ తో పొడి విత్తన శుద్ధి లేదా 1 గ్రాము లీటరు నీటికి కలుపుకుని అందులో 24 గంటలపాటు మండే కట్టుట వలన తడి విత్తన శుద్ధి అవలంబించవచ్చు. ఒక ఎకరాకు 5 సెంట్ల నారుమడి అవసరమవును అందులో 5 కిలోల యూరియా, 2 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ తో పాటు 6 కిలోల భాస్వరం వేసుకోవాలి.
యాసంగిలో మాత్రం భాస్వరం రెట్టింపు మోతాదులో వేసుకోవలెను. మోగి పురుగు నివారణకు గాను నరు పీకే 7 రోజుల ముందు ఎకరా నారుమడికి 800 గ్రాముల కార్బొఫురన్ 3జి గుళికలు వెదజల్లి నీరు పెట్టుకోవాలి. నారు 28 రోజులు మించకుండా నాటు వేసుకోవాలి.\
Also Read: ‘శ్రీ’ పద్దతిలో వరి సాగు.!
వయసు మించిన దిగుబడుల పైన దుష్ప్రభావం పడే అవకాశం అధికం. మొత్తం భాస్వరం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అలాగే నత్రజని మాత్రం మొత్తం మూడు దఫాలుగా 15 రోజుల విరామంతో చిరుపొట్ట దశకు మునుపే వేసుకోవాలి. పోటాష్ 75% ఆఖరి దుక్కిలో మరో 25% అనుకురా దశలో వేసినట్లయితే గింజ బాగా గట్టిపడి మంచి నాణ్యత గల పంట చేతికి వస్తుంది.
యాసంగిలో జింక్ లోపలక్షణాలు అధికంగా కన్పిస్తాయి.దీనికి గాను 20-25కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి, పంట వేసిన తరువాత కనిపించినట్లైతే 2గ్రాముల జింక్ సల్ఫేట్ పంటపైన పిచికారీ చేసుకోవాలి. కలుపు నివారణకు ప్రితిలాక్లోర్ లేదా ప్రేతిలాక్లోర్+బెన్ సులీఫురం ఈథైల్ 4కిలోల గుళికలు 20కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలి. నాటిన 20 రోజులలోపు గడ్డి లేదా వెడల్పాకు కలుపు కోసం బిస్ పైరీబాక్ సోడియంను 100మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
మోగి పురుగు ఉదృతి గమనించిన కార్టోప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు ఇసుకతో కలిపి పొలంలో చల్లుకోవాలి అదే చిరుపొట్ట దశలో మాత్రం క్లోరంథ్రానిలిప్రోల్ 60 మిల్లి లీటర్లు పిచికారీ చేసుకోవాలి. సుడి దోమ చిరుపొట్ట నుండి పూత దశ వరకు ఆశిస్తుంది. నివారణకు గాను బుప్రోఫెజిన్ 1. మిల్లి లీటర్లు లేదా పైమిట్రోజెన్ 0.5 గ్రాములు మొక్క మొదలు దగ్గర పడేలా వేసుకోవాలి.
బాక్టీరియా ఎండాకు తెగులు నివారణకు అంకుర దశలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు+ప్లాంటమైసిన్ 0.3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి.పూత దశలో మాత్రం కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. పాము పొడ తెగులు ఆశించినపుడు వాళ్లిదమైసిన్ 2 గ్రాములు లేదా హెక్సకోనజోల్ 2 గ్రాములు పిచికారీ చేసుకోవాలి.
Also Read: వరిసాగులో వివిధ పద్ధతులు – రైతులు ఆచరించాల్సిన అంశాలు