Flavored Water ఎండాకాలంలో అనారోగ్య సమస్యలు.. డీహైడ్రేషన్‌కు గురికావడం జరుగుతుంది. దీంతో ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి నీళ్లు.. పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. వీటన్నింటికంటే.. ఈ సీజన్లో నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటారు.. అయితే కొందరు ఎక్కువగా నీళ్లు తాగడానికి ఇష్టపడరు. తక్కువ మోతాదులో నీటిని తీసుకుంటారు. అలాంటి సమయంలో నీటిలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యంగానికి మేలు చేస్తుంది. నిజానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. నీరు పుష్కలంగా తాగడం వలన శరీరంలో నీటి కొరత ఉండదు. శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. అయితే నీటి రుచి మార్చుకోవడానికి కొన్ని పదార్థాలను జత చేసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి.
పుదీనా.. ఇందుకోసం ముందుగా ఒక బాటిల్ నీటిలో కొన్ని పుదీనా ఆకులను కలపాలి. అందులోనే కొంత చక్కెర వేసి కలపాలి. మరింత రుచి కావాలంటే.. అందులో కాస్త నిమ్మకాయం రసం కూడా కలుపుకోవచ్చు.. ఈ నీటిని దాహం వేసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇది వేసవిలో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేందుకు సహయపడుతుంది.
పుదీనా ప్రయోజనాలు.. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఇవి సహయపడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి పుదీనా సహయపడుతుంది.
దాల్చిన చెక్క ప్రయోజనాలు.. దాల్చిన చెక్క ఔషధ మూలకాలు అధికం. ఇందులో యాంటీ బాక్టీరియల్.. యాంటీ ఫంగల్.. యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.
వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దాల్చిన చెక్క నీటిని తాగడం వలన వేసవిలో హీట్ స్ట్రోక్.. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
నిమ్మకాయ ప్రయోజనాలు.. నిమ్మకాయ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో నిమ్మకాయలో ఫైబర్.. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది శరీరంలో నీటి కొరతను పూర్తి చేయడం ద్వారా డీహైడ్రేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి.