ఉద్యానశోభమన వ్యవసాయం

Neelakurinji Flowers: 12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే పువ్వులు

0
Neelakurinji Flowers

Neelakurinji Flowers: భారతదేశంలోని ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నగరాలు, గ్రామాలు, పర్వతాలు, గుహలలో ఎన్నో ప్రకృతి రహస్యాలు దాగి ఉన్నాయి. కేరళలో ఏ ప్రదేశానికి ట్రిప్‌ అయినా సరే ట్రైన్‌ పాలక్కాడ్‌ సమీపించగానే మరోలోకంలోకి వెళ్తున్న భావన కలుగుతుంది. పచ్చని పొలాలు, లెక్కపెట్టటానికి సాధ్యం కానన్ని కొబ్బరిచెట్లు కనువిందు చేస్తాయి. అలానే కేరళలో మరో అద్భుతం కూడా కనువిందు చేస్తుంది. ప్రకృతికి పువ్వులకు విడదీయని సంబంధం ఉంది. పువ్వులు అన్నీ ఒక ఎత్తైతే.. నీలకురింజి పువ్వులు మరో ఎత్తు.. అవి కేవలం 12 ఏళ్లకు మాత్రమే ఒకసారి వికసిస్తాయి.. నీలకురింజి పూలను కేరళలోని ఇడుక్కి జిల్లాలో పండిస్తారు. నీలకురింజి మామూలు పువ్వు కాదు చాలా అరుదైన పుష్పం. ఈ పూలను చూడాలంటే 12 ఏళ్లు ఆగాల్సిందే. నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క.

Neelakurinji Flowers

Neelakurinji Flowers

Also Read: సేంద్రియ పద్ధతిలో కుంకుమపువ్వు రంగు పుట్టగొడుగులు

ఒకసారి ఎండిపోయిన తర్వాత మళ్లీ పూయడానికి 12 ఏళ్లు పడుతుంది. సాధారణంగా నీలకురింజి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూస్తుంది. ఈ సంవత్సరం వికసించిన తరువాత ఇప్పుడు దాని అందం తదుపరిసారి 2033 సంవత్సరంలో కనిపిస్తుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పువ్వులు చాలా కనిపించాయి. నీలకురింజిలోని మరో విశేషమేమిటంటే ఇది భారతదేశంలోనే పూస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇవి పూయవు. నీలకురింజి ప్రధానంగా కేరళలో వికసిస్తుంది. కేరళతో పాటు తమిళనాడులో కూడా ఈ పూల అందాలు కనిపిస్తున్నాయి. నీలకురింజిని చూసేందుకు కేరళలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

Neelakurinji Flowers Blooming

Neelakurinji Flowers Blooming

కేవలం నీలకురింజిని చూసేందుకు లక్షల రూపాయలు వెచ్చించి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది పర్యాటకులు కేరళకు వస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కురింజి పూసినప్పుడు కొండలన్నీ నీలిరంగు దుప్పటి పరిచినట్లు ఉంటాయి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్‌లను మామూలు రోజుల్లో చూసిన వాళ్లు కూడా కురింజి కోసం ఆ పువ్వు పూసే ఏడాది మళ్లీ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటారు. బొటానికల్‌గా వీటిని 50 రకాల జాతులుగా చెప్తారు కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి.

Also Read: కొత్తిమీర Vs పుదీనా ప్రయోజనాలు

Leave Your Comments

Medicinal Plant: రైతులకు ఔషధ మొక్కల పెంపకం కొత్త అవకాశం

Previous article

Tulip Garden: ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్ ప్రారంభం

Next article

You may also like