Muskmelon Health Benefits: వేసవి వచ్చేసింది. ఈ వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. కర్బూజని మస్క్ మెలోన్ అని కూడా అంటారు. ఇది ఒక రకమైన పుచ్చకాయ, దీనిని శాస్త్రీయంగా కుకుమిస్ మెలో అని పిలుస్తారు. ఇది ఓవల్ లేదా గుండ్రని ఆకారంలో ఉంటాయి. వాటి బయటి షెల్ పసుపు నుండి ఆకుపచ్చ మరియు గోధుమ రంగు వరకు వివిధ రకాల షేడ్స్‌లో వస్తుంది.
మస్క్ మెలోన్ లో 90% నీరు ఉంటుంది. ఇందులో డైటరీ ఫైబర్స్ కూడా ఉంటుంది. తక్కువ క్యాలరీలు మరియు కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఖర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్‌ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది బరువు తగ్గించే అద్భుతమైన ఎంపిక. ఇందులో లుటిన్, బీటా-కెరోటిన్ మరియు జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయి.
Also Read: పుచ్చ మరియు కర్బూజా పంట లో సస్యరక్షణ
ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్. అన్నింటికంటే ముఖ్యంగా ఖర్బూజ క్రమం తప్పకుండా తింటే..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మరోవైపు ఖర్బూజ పండ్లలో అధికమొత్తంలో ఉండే విటమిన్ ఎ, సిలు కంటికి అవసరమైన పోషకాల్ని అందిస్తాయి. కంటిపాపను బలోపేతం చేస్తాయి. కర్బూజ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. ఇక ఇందులో ఉండే ఫైబర్..కొద్దిగా తినగానే కడుపు నిండిన అనుభూతి కల్పిస్తుంది. అతి ఆకలిని నివారిస్తుంది.
Also Read: బహుళపంట సాగుతో మేలు… బంగారం పండిస్తున్న ఆదర్శ రైతు బసవరాజు