Kishmish: భారతీయ వంటకాలలో మరియు స్వీట్‌లలో ఎండుద్రాక్షలను చేర్చడం తెలిసిందే. ఎండుద్రాక్ష అనేది ఒక డ్రై ఫ్రూట్. సూపర్ మార్కెట్లలో కిష్మిష్ అందుబాటులో ఉన్నప్పటికీ, అత్యధిక నాణ్యత మరియు తాజాదనం కోసం మీరు దీన్ని ఎల్లప్పుడూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఇంట్లో ఎండుద్రాక్షను తయారు చేయడానికి ద్రాక్ష పండు ఉంటె చాలు. అంతేకాకుండా మార్కెట్‌లలో ద్రాక్ష పుష్కలంగా లభించే సంవత్సరం ఇది. కాబట్టి మీరు ఇంట్లోనే ఎండు ద్రాక్షలను తయారు చేసుకోవచ్చు.
దశ 1: బాగా పండిన & తీపి ద్రాక్షను తీసుకోండి. మీకు నచ్చిన పరిమాణాన్ని మీరు ఎంచుకోవచ్చు.
దశ 2: ఆకుపచ్చ ద్రాక్షను ఎంచుకుని వాటిని బాగా కడిగివేయండి.
దశ 3: తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్‌ని తీసుకుని, ఇడ్లీ ప్లేట్‌లో ద్రాక్షను అమర్చండి (ప్రత్యామ్నాయంగా, మీరు ఏవైనా ఇతర చిల్లులు ఉన్న ప్లేట్‌లను కూడా ఉపయోగించవచ్చు)
దశ 4: ద్రాక్షను 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి
దశ 5: వాటిని శుభ్రమైన గుడ్డ లేదా మందపాటి ప్లాస్టిక్ షీట్ లేదా ట్రేపై పర్చండి. ఎండబెట్టడం కోసం వాటిని సూర్యకాంతి కింద ఉంచండి.
దశ 6: 2-3 రోజుల్లో ద్రాక్ష తగ్గిపోతుంది మరియు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు మీకు కావాల్సిన కిష్మిష్ రెడీ అయిపోతుంది.
Also Read: కొండ ప్రాంతాల్లో ద్రాక్ష సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచిన రైతు
ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
* బరువు తగ్గడం, లైంగికపరమైన కోరికలు తగ్గడం లాంటి సమస్యలున్న వారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
* సంతానలేమితో బాధపడుతున్న వారు ఎండు ద్రాక్ష తింటే ఉపయోగకరమని పలు పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది.
* జ్వరంతో బాధపడేవారికి కిస్మిస్ దివ్య ఔషధం.
* చిన్నపిల్లల్లో జీర్ణశక్తి బాగా పెరిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
* ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
* విటమిన్ బి ఆహారాన్ని విఛ్చిన్నం చేసి శరీరానికి పోషకాలు గ్రహించడంలో తోడ్పడుతుంది.
* కాపర్ మెలనిన్ ఉత్పత్తిలో కీలకం. కేశాలు నల్లగా మెరవాలంటే కాపర్ కలిగి ఉండే ఎండు ద్రాక్ష తింటే సరి. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నానబెట్టిన కిస్‌మిస్‌లను తింటే బాడీ మెటబాలిజం సమతుల్యం అవుతుంది. జీవక్రియలు చురుగ్గా ఉంటాయి.
Also Read: నల్ల ద్రాక్ష వలన కలిగే మేలు..