ICAR: భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్యమైన కూరగాయల పంట కోసం బయో-ఇంటెన్సివ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ అనే అంశంపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉమియామ్‌లో జరిగింది. శిక్షణా కార్యక్రమాన్ని ICAR రీసెర్చ్ కాంప్లెక్స్ క్రాప్ సైన్స్ విభాగం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి నెట్‌వర్క్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ (NPOF) కింద దత్తత తీసుకున్న పింథోర్ గ్రామానికి చెందిన 35 మంది రైతులు హాజరయ్యారు. మూడు రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధాన పంట వ్యాధులు మరియు ముఖ్యమైన కీటకాల తెగుళ్లపై దృష్టి సారించింది. ఈ విషయాలను రైతులకు ఉపన్యాసాల ద్వారా క్షుణ్ణంగా వివరించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత అనే అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులకు బాగా అర్థమయ్యేలా పంటల వ్యాధులు, పురుగుల తెగుళ్లపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు.
Also Read: వ్యవసాయ ఉత్పత్తులు మినహా మరేం రష్యాకు అందించం- బేయర్
డివిజన్ క్రాప్ హెడ్ డాక్టర్ బిజోయ భట్టాచార్జీ రైతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యవసాయ పద్ధతులు, జీవవైవిధ్య పరిరక్షణ మరియు కాలుష్యాన్ని తగ్గించడం కోసం సేంద్రీయ తెగులు నిర్వహణ ఆవశ్యకతను బలంగా చెప్పారు. రైతులకు ఫ్రూట్ ఫ్లై ట్రాపింగ్ పరికరాలు, కూరగాయల విత్తనాలు మరియు బయో-పెస్టిసైడ్స్ వంటి ఇన్‌పుట్‌లను అందించారు. ఇక ICAR నుండి వచ్చిన శాస్త్రవేత్తలు రైతుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO) మరియు స్టార్ట్-అప్‌పై ఒక రోజు సెమినార్‌ను కూడా అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్, ICAR రీసెర్చ్ కాంప్లెక్స్ అందించింది, ఈ ప్రాంతంలో స్థానికంగా లభించే వ్యవసాయ వస్తువులకు మార్కెట్ లింక్‌లను రూపొందించడానికి. NAARM, a-IDEA, హైదరాబాద్‌తో కలిసి ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సెమినార్ జాతీయ మరియు అంతర్జాతీయ వినియోగదారులను ఆకర్షించడంలో తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సహాయం చేస్తుంది. అలాగే FPOల ద్వారా ఈ ప్రాంతానికి సమ్మిళిత వృద్ధిని తీసుకువస్తుంది. కార్యక్రమానికి గౌరవ అతిథిగా NABARD షిల్లాంగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జేమ్స్ పి జార్జ్ హాజరయ్యారు.
Also Read: నీటి చెస్ట్‌నట్‌లు, ఔషధ మొక్కల సాగుకు చేయూత