Farmers Protest: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొన్న రైతు శుక్రవారం మృతి చెందాడు. చనిపోయిన రైతు బరోడా గ్రామానికి చెందిన గిర్ధర్ పటేల్ అని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొన్న సియారామ్ పటేల్ మంత్రాలయానికి వెళ్లేందుకు తోటి ఆందోళనకారులతో కలిసి శుక్రవారం పాదయాత్రలో పాల్గొన్నారు . ఈ క్రమంలో ఒక్కసారిగా తల తిరగడంతో నేలపై పడిపోయాడు ఆ రైతు. సియారామ్ పటేల్ పరిస్థితిని చూసిన తోటి ఆందోళనకారులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రైతు ఆకస్మిక మృతి పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సంతాపం వ్యక్తం చేశారు మరియు కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఇంతకీ రైతుల ఉద్యమానికి కారణం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని డిమాండ్ చేస్తూ రాజధాని రాయ్‌పూర్‌లో రైతులు ఆందోళన మొదలుపెట్టారు. రాయ్‌పూర్‌లో రైతులు ఆందోళనకు దిగి 2 నెలలు దాటింది. నిన్న కిసాన్ ఆందోళన 68వ రోజు కావడంతో రైతులు తమ సహచరులతో కలిసి మంత్రాలయానికి వెళ్లేందుకు పాదయాత్రలో పాల్గొన్నారు సియారామ్ పటేల్. పాదయాత్ర చేస్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు సియారామ్ పటేల్. చనిపోయిన రైతు వయస్సు 66 సంవత్సరాలు. వృద్ధ రైతు మృతిపై ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ స్వయంగా మీడియాతో మాట్లాడారు. మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతు మృతిపై తమ అధికారులు విచారణ జరుపుతున్నారని, ఆయన మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Also Read: రైతుల డిమాండ్లకు దిగొచ్చిన హర్యానా ప్రభుత్వం
రైతు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు. CMO ఛత్తీస్‌గఢ్ ట్విట్టర్లో ఇలా రాసింది. నవ రాయ్‌పూర్ రాజధాని ప్రాంతానికి చెందిన 66 ఏళ్ల రైతు సియారామ్ పటేల్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ముందు రైతులు అనేక డిమాండ్లు ఉంచగా అందులో 6 డిమాండ్లను సర్కారు ఆమోదించింది.
Also Read: రైతుసోదరులకు వాతావరణాధారిత సలహాలు మరియు సూచనలు