Lockdown Impact On Poultry Sector: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి (కోవిడ్-19) 130 కోట్ల దేశ ప్రజారోగ్యాన్ని గందరగోళ పరిస్థితిలో పడవేసింది. నెలల తరబడి కొనసాగిన (మూడు దశల నిరంతర లాక్డౌన్) ప్రజా గృహ నిర్బంధం ప్రతిఒక్కరికీ ఒక వింతైన అనుభవం. లక్షలాది మంది పేద మరియు సన్నకారు రైతులు తమ పంటలు మరియు / లేదా పశువులను కాపాడటం మరియు తద్వారా వారి జీవనోపాధికి భరోసా ఇవ్వడం ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, ఈ రంగంతో సంబంధం ఉన్న వారందరికీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆందోళన కలిగించింది. దేశంలో 852 మిలియన్ కోళ్లు ఉన్నాయని అంచనా ఇవి ఈ దేశంలోని మాంసాహారులందరికి ప్రోటీన్ ను అందిస్తుంది, తద్వారా అన్ని వయసుల వారికి పోషక భద్రతకు సహాయపడుతుంది. ప్రచురించిన సమాచారం పబ్లిక్‌తో పరిచయం ద్వారా సేకరించి, ఈ అంశంపై కొంత విశ్లేషణ చేయడం జరిగింది.
పౌల్ట్రీరంగం పై ప్రభావం:
దేశంలో 2019 సంవత్సరంలో దాదాపు 3.8 మిలియన్ టన్నుల పౌల్ట్రీ మాంసాన్ని వినియోగించారని అంచనా, దీని విలువ సుమారు రూ. రిటైల్ ధర పరంగా 85,000 కోట్లు. అదే సమయంలో, దేశంలోని గుడ్డు ఉత్పత్తి 109 బిలియన్ గుడ్లుగా అంచనా, దీని విలువ సుమారు రూ. 45,000 కోట్లు. గత 3 సంవత్సరాలలో చూసినట్లుగా, ఈ రంగంలో 10-12 శాతం నిరంతర వృద్ధి కనపడిరది. కానీ 2020 సంవత్సరం ప్రారంభంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పౌల్ట్రీ రంగం పైన తన ప్రభావాన్ని చూపించింది. అన్నింటిలో ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ యొక్క క్యారియర్‌గా పౌల్ట్రీ కోళ్ల ఇతర పక్షుల పుకార్లు, దేశంలోని అనేక ప్రాంతాల్లో కోడి మాంసానికి డిమాండ్ తగ్గడానికి దారితీసింది. తరువాత, కోళ్లు తినడం చాలా సురక్షితం అని వివిధ ఏజెన్సీలు జారీ చేసిన స్పష్టత, వినియోగదారులను చాలా వరకు ఒప్పించగలిగాయి.
రవాణాపై గవర్నమెంటు ఆంక్షలు కారణంగా కోవిడ్ -19 లొక్డౌన్ తరువాత దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ తగ్గింది. మాంసం మరియు గుడ్ల అమ్మకాలతో సహా ఆహార వస్తువుల దుకాణాలను తెరవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు లేనప్పటికీ, ప్రజల కదలికలు తగ్గడం వలన ఈ ఉత్పత్తుల మార్కెట్‌ని అడ్డుకున్నాయి. మాంసాహారం తీసుకునే జనాభా చాలా మంది ఈ సమయంలో వీటిని అవసరమైన ఆహార పదార్థాలుగా పరిగణించలేదు, మరియు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. భారతదేశంలో వినియోగదారులు ఎక్కువగా తాజాగా కోడి మాంసం ఇష్టపడతారు, దీనివలన 90 శాతం బ్రాయిలర్ కోడి మాంసం చిన్న దుకాణాలు అమ్మకాల వరకు ఆగిపోయాయి.
ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లుతో పాటుగా చిన్న పెద్ద హోటళ్లు మూసివేయడం, రవాణాలో కలిగిన అంతరాయం, ఉత్పత్తుల పాడయ్యే అవకాశం పెరిగింది. గుడ్లు నిల్వ చేసే మాదిరిగా, మాంసం కోల్డ్-చైన్ సౌకర్యాల తగినంత లేకపోవడం వలన ఉత్పత్తులను బలవంతంగా పారవేయడానికి దారితీసింది. కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి వేలాది ప్రత్యక్ష కోళ్లను పాతిపెట్టడం వంటి అనేక దిగ్భ్రాంతికరమైన సంఘటనలు గుంపులుగా కోళ్లను చంపడం మరియు కాల్చడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో అమ్మకాలు తగ్గడం వలన వాటిని ఉచితంగా ఇవ్వడం గమనించాము.
Also Read: కోళ్ల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తున్న మహిళా రైతులు
ఒక అంచనా ప్రకారం, కోవిడ్ -19 భయం మరియు లాక్డౌన్ 10 లక్షల బ్రాయిలర్ రైతులు మరియు 2 లక్షల లేయర్ రైతులను ప్రభావితం చేసింది, మరియు ఏప్రిల్ 2020 చివరి నాటికి, దీని వలన సుమారు రూ. 27,000 కోట్లు నష్టం వాటిల్లింది. కొన్ని ప్రదేశాలలో, లైవ్ కోడి ధర రూ. 15-35 కిలోల కంటే తక్కువగా అమ్మబడిరది. గవర్నమెంటు ఆంక్షల సడలింపులతో, చికెన్ మరియు గుడ్లకు డిమాండ్ పెరుగుదల క్రమ క్రమంగా నెమ్మదిగా పెరుగుతుంది.
కొన్ని చిన్న మరియు మధ్యస్థం పౌల్ట్రీ ఫారాలు లాక్డౌన్లో కూడా పెంపకం చేపట్టినప్పటికీ, సరైన దాణా సరఫరా లేక ఇబ్బంది పడ్డాయి. దీనితో పాటు, పెరటి కోళ్ళ రంగం కూడా ప్రభావితం అయ్యింది. చిన్న మరియు ప్రాంతీయ మార్కెట్టు సరిగా లేక పెరటి కోళ్ళ అమ్మకాలు తగ్గాయి. కోడి పిల్లలకు డిమాండ్ తగ్గడం వలన హ్యాచరీలు కూడా మూసివేయబడ్డాయి. మొదటి లాక్డౌన్ సమయంలో కొన్ని హ్యాచరీలు గుడ్లు మరియు రోజుల వయసు ఉన్న కోడి పిల్లలను పారవేయవలసి వచ్చింది. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం మరియు కూలీల కొరత దీనికి కారణం.
కార్మికుల లభ్యత పై ప్రభావం:
పౌల్ట్రీ ఉత్పత్తి రంగంలో ఎక్కువ భాగం చిన్న/సన్నకారు రైతులు మరియు భూమిలేని కూలీలు ఆధిపత్యం చెలాయిస్తుండగా, కార్మికులు అందుబాటులో లేక పౌల్ట్రీ ఫారాలు, హేచరీలు, ఫీడ్ ప్లాంట్లు మరియు పాడి ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడ్డాయి. ఈ పరిస్థితి అత్యవసర పరిస్థితిలో పట్టణం నుండి గ్రామీణ ప్రాంతాలకు కార్మికులు తరలి వెళ్లడం వలన వచ్చింది.
దాణా మరియు వైద్య సదుపాయం పై ప్రభావం:
మొదటి లాక్డౌన్ సమయంలో, దాణా మిల్లులు మూసివేయడం వలన, దాణా కొరత ఏర్పడిరది. ఇదే సమయంలో సరైన వైద్య సదుపాయం కూడా కష్టమైంది. సమయానికి చేయవలసిన టీకా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ఆగిపోవడం లేదాప్‌ా ఆలస్యం అవడం వలన, రానున్న రోజులలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువైనది. దీనికి తోడు, పెద్ద పౌల్ట్రీ ఫారాలు మరియు పౌల్ట్రీ ఆధారిత అనుబంధ సంస్థలలో కూలీల సమస్య అధికమైనది. చాల మంది ఉపాధి లేక తమ స్వంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళడం వలన, కూలీల కొరత ఏర్పడిరది.
పునరుద్ధరణ కోసం వ్యూహాలు:
1. ఈ శాఖని సాధారణ స్థితికి తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ అనేక వ్యూహాలను తీసుకున్నాయి. వాటిలో అవసరమైన సేవల కింద పశుసంపద మరియు పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాను అత్యవసరమైన వస్తువులుగా ప్రకటించడం, పశువులు మరియు పౌల్ట్రీ ఉత్పత్తుల అంతర్రాష్ట్ర రవాణాను కొనసాగించడం, అధిక మొత్తంలో కొనుగోళ్లను సులభతరం చేయడం. అన్ని సౌకర్యాలు ఫీడ్ ప్లాంట్లు, వ్యాక్సిన్ తయారీ యూనిట్లు వంటి అనుబంధ పరిశ్రమలుకు కల్పించడం.
2. పౌల్ట్రీ చౌకైన మూలం జంతు ప్రోటీన్లలో ఒకటి, ఇది ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది, ప్రజలు మార్కెట్‌కి వెళ్లడం ప్రారంభించిన తర్వాత పౌల్ట్రీ మాంసం వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం, చికెన్ వినియోగంతో కోవిడ్-19కి ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేయడంతో, మాంసాహారులకు కోడి మాంసంపై ఇప్పుడు నమ్మకం కలిగి ఉన్నారు.
3. పౌల్ట్రీ పెంపకం మరియు సంబంధిత ఉత్పత్తి మరియు సరఫరా, నిలువరించడంపై భారత ప్రభుత్వం అన్ని పరిమితులను ఎత్తివేయడంతో, పరిశ్రమ పునరుద్ధరించబడి, సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో, పరిశ్రమ ప్రభుత్వం లేదా పారిశ్రామిక సంస్థల నుండి కొంత వరకు ఆర్థిక లేదా అనుబంధ అవసరాల మద్దతుతో ఉద్దీపనను కోరుకుంటుంది. దీర్ఘకాలంలో, చికెన్ మరియు ఇతర నిలువ-ఆధారిత ఉత్పత్తులకు, రాబోయే సంవత్సరాల్లో బలమైన ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ ద్వారా వినియోగదారుల ఆలోచనా ధోరణిలో మార్పు ఉంటుందని కూడా భావించవచ్చు.
4. పౌల్ట్రీ రంగంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, ప్రణాళికాబద్ధమైన టీకా కార్యక్రమాలను కొనసాగించడానికి తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం.
5. కోవిడ్-19 కార్మికుల రివర్స్ మైగ్రేషన్‌కు దారితీసినందున, స్థానిక ప్రభుత్వం ఈ తిరిగి వచ్చిన కార్మికులను లాభదాయకమైన ఉపాధిలో నిమగ్నం చేయాలి.
6. ప్రభుత్వాలు రుణాల మంజూరులో శ్రద్ధ చూపించి, క్రొత్త వ్యాపారస్థులు మరియు వున్నా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారికి సబ్సిడీలు మరియు తక్కువ వడ్డీ రుణాలకు ఆదేశాలు ఇవ్వాలి.
ముగింపు:
లాక్డౌన్, ప్రాణాంతక కోవిడ్-19 వ్యాధి నుండి నివారణ వైపు నడిపించడంలో ప్రాముఖ్యతను కలిగి ఉంది, అయితే పౌరులు రోజువారీ అవసరాల కోసం పౌల్ట్రీ నుండి ఉత్పత్తి అయ్యే ప్రోటీన్‌ను ఆహారంలో తీసుకుంటూ మాంసపు విక్రయ కేంద్రాల వద్ద జాగ్రత్తలు పాటిస్తూ అలాగే, లాక్ డౌన్ పరిస్థితిలో ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలో, కేంద్ర మరియు రాష్ట్ర పాలకులు, ప్రజలకు అవసరమైన ధైర్యం, ఆర్థిక సహకారం, మరియు ఈ రంగాన్ని పునరుద్ధరించడానికి అనుబంధ వాటాదారుల జీవనోపాధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కొంత మేర దీని ప్రభావం నుండి తప్పించ్చుకోవచ్చు. ఈ ప్రయత్నంలో, ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం, ఎన్‌జిఒలు మరియు సాధారణ పౌరుల పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది.
డా.టి. సుస్మిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పౌల్ట్రీ సైన్స్),
డా.సి. అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనిమల్ న్యూట్రిషన్),
లైవ్‌స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, గన్నవరం, కృష్ణ జిల్లా .
Also Read: టర్కీ కోళ్ళ పెంపకం లో పోషక యాజమాన్యం
Leave Your Comments