అంతర్జాతీయంవార్తలు

NASA Commodity Classic Conference: అతిపెద్ద వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొంటున్న నాసా

1
NASA Commodity Classic Conference

NASA Commodity Classic Conference: NASA 2022లో జరిగే కమోడిటీ క్లాసిక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటుంది, ఇది అమెరికా అతిపెద్ద రైతు నేతృత్వంలోని రైతు-కేంద్రీకృత విద్యా మరియు వ్యవసాయ కార్యక్రమం. ఇందులో నాసా భూమి పరిశీలన ఉపగ్రహాలు మరియు సైన్స్ అధ్యయనాల నుండి సేకరించిన సమాచారం, సాంకేతికతలు మరియు వనరులు గురించి చర్చిస్తారు. కాగా రైతులు మరియు సంబంధిత అధికారులు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అందించబడిన NASA డేటాపై ఆధారపడతారు. ఇందులో రోజువారీ నీటి నిర్వహణ, మొక్కలు నాటడం మరియు మార్కెట్ నిర్ణయాలకు సంబంధించి విషయాలు అందుబాటులో ఉంటాయి.

NASA Commodity Classic Conference

NASA Commodity Classic Conference

Also Read: మామిడిపై ఫ్రూట్ ఫ్లై డేంజర్ బెల్స్

మేము కమోడిటీ క్లాసిక్‌లో పాల్గొంటున్నాము అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. ప్రస్తుతం నాసా ఉపగ్రహాలు 50 సంవత్సరాలకు పైగా భూమి, నీరు, ఉష్ణోగ్రత, వాతావరణంపై అందుబాటులో ఉన్న డేటాను అందించాయి.

అయితే ప్రస్తుతం నాసా వివిధ అంశాలపై చర్చలకు సిద్ధమైంది. ఇందులో నాసా డేటా వ్యవసాయ పరిస్థితులకు ఎలా సహాయపడగలదు? మరియు నాసా డేటా వ్యవసాయ రంగంలో వచ్చే కరువులు, అలాగే తీవ్రమైన వాతావరణం వంటి మార్పులకు ఎలా సిద్ధం చేయాలో సహాయపడుతుంది. కాగా నాసా వర్చువల్ మరియు ఫిజికల్ ఎగ్జిబిషన్‌లను మరియు సైన్స్ అప్లికేషన్‌లతో అందిస్తుంది. కాన్ఫరెన్స్ వారం అంతా వర్చువల్ డిస్‌ప్లేను పబ్లిక్ చూడగలరు.

Also Read: రైతుల డిమాండ్లకు దిగొచ్చిన హర్యానా ప్రభుత్వం

Leave Your Comments

Animal Husbandry: కాశ్మీర్ పౌరులకు అదనపు ఆదాయ వనరుగా మారిన డెయిరీ

Previous article

Farmers Protest: రైతుల డిమాండ్లకు దిగొచ్చిన హర్యానా ప్రభుత్వం

Next article

You may also like