నేలలు:
బంక నేలలు , నీటి పారుదల మరియు మురుగునీటి వసతిగల సారవంతమైన గరప నేలలు అనుకూలం.
రకాలు:
రామ్ నగర్, జీ-41, ఊటీ-1,యమున , సఫెదా.
విత్తన శుద్ది:
2లీటర్ల ఆవు మూత్రం ,ఒక కిలో పశువుల పేడ, ఒక కిలో మట్టి (గట్టుమట్టి ) మరియు 150గ్రా|| ఇంగువను 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం చేయాలి. నాటే ముందు పాయలను ఇందులో 15 నుండి 20 నిమిషాలు ఉంచి నాటుకోవాలి.
విత్తన మోతాదు:
ఎకరాకు 200 నుంచి 250 కిలోల విడి పాయలుగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం:
- ఎకరాకు 2500 కిలోల నాడేప్ కంపోస్ట్ వేయాలి.
- 125 కిలోల ఘనజీవామృతం వేస్తున్న విత్తనాలు నాటాలి.
- 30 రోజుల తర్వాత 125 కిలోల ఘనజీవామ్రుతం మొక్కల్లో మొదల దగ్గర వేయాలి.
- 45, 60 రోజులకు ద్రవ జీవామృతం నీటి తడులతోపాటు పాలించాలి.
Also Read: వెల్లుల్లి పండించే విధానం.. ప్రయోజనాలు..!
పురుగులు తెగులు నివారణ:
- పంట చుట్టూ రక్షక పంటగా జొన్న మొక్కజొన్న లేదా సజ్జ వడలు వేసుకోవాలి.
- పేనుబంక నివారణకు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం పిచికారి చేసుకోవాలి.
- కుళ్లు తెగులు వల్ల మొలకలు వచ్చేటప్పుడు కుళ్లి పోతాయి. దీని నివారణకు విత్తే ముందు పాయలను తప్పనిసరిగా పైన తెలిపిన విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం:
- పాయలు నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి.
- పది రోజులకు ఒకసారి నీటిని ఇవ్వాలి.
- గడ్డి ఎదిగే దశలో తప్పనిసరిగా నీరు కట్టాలి.
సస్య రక్షణ:
రసం పీల్చే పురుగులకు నివారణ 5 శాతం వేప గింజల కషాయం ఉమ్మెత్త ఆకుల కషాయం పిచికారి చేయాలి. బూడిద తెగులు ఆశించిన 6 లీటర్ల పుల్లటి మజ్జిగ పైరుపై 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
Also Read: వంగ సాగు సస్య రక్షణ