వ్యవసాయ పంటలు

Fruit Cutting: పండ్ల కోత సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలు

1
Fruit Cutting
Fruit Cutting

Fruit Cutting: పండ్లను పండించడం ఒక ఎత్తు అయితే వాటిని కోత కోసి మార్కెటింగ్  ఇంకొక ఎత్తు. కోత  సమయం లో దాదాపు 10-15% వరకు పాడవడం జరుగుతుంటాయి. దీనికి ముఖ్య కారణాలు సరైన దశలో కోయకపోవడంతో పాటు సరైన పద్ధతులు పాటించకపోవడం మరొకటి. సరైన సూచనలు పాటించి రైతులు కోత  సమయంలో పంట నష్టం నివారించుకోవచ్చు.IIHR ఈ క్రింద చెప్పబడిన ప్రాధమిక అంశాలు సూచించారు.

Fruit Cutting

Fruit Cutting

Also Read: జామ పండ్లే కాదండోయ్.. జామ ఆకులు ఆరోగ్యానికే మేలే

పండ్ల కోత చేపట్టే ముందు  గమనించవలసిన ప్రాథమిక నియమాలు:

1. పండ్లను లాగి క్రింద పడేయకూడదు.
2. పండ్లను నేలపై పడేయకూడదు, జాగ్రత్తగా సంచులలో నేలపైకి దింపాలి.
3. వర్షాలు కురిసే సమయంలో లేదా మంచు కురిసే సమయంలో పండ్లను కోయకూడదు
తేమ కారణంగా పైపొరలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. పళ్లపైనా తేమ ఉంటే అధిక వేడి  ఉత్పత్తి అవడం వలన  కుళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
4. పండ్లను కోసిన తర్వాత నేరుగా ఎండలో కుప్పలు వేయకూడదు.
5. పండ్లను నేలపై  సమానంగా పరచాలి.
6. దెబ్బతిన్న, వ్యాధిసోకిన  పండ్లను తక్షణమే తొలగించాలి.వీటిని ఆరోగ్యకరమైన పండ్లతో కలుపరాదు.
7. పగటిపూట చల్లని సమయంలో (ఉదయం లేదా సాయంత్రం) పంట కోయాలి.
8. స్థానిక మార్కెట్ల కోసం ఉత్పత్తిని ఉదయాన్నే కోయాలి.  దూరపు మార్కెట్‌లో పంట పండించడానికి తగిన రవాణాను ముందే ఏర్పాటు చేసుకోవాలి.దీనికోసం పండ్లను ముందురోజు సాయంత్రం కోసుకోవాలి.
9. సరికాని పద్ధతులలో  పంట కోయడం,బాక్సులను అధికంగా నింపడం,వదులుగా ప్యాకింగ్ చేయడం వల్ల
రవాణా సమయంలో పాడయిపోయే అవకాశం ఉంది.కాబట్టి, పంట యొక్క సున్నితత్వం, పరిపక్వత వంటి కారకాలు
పరిగణనలోకి తీసుకుని తగు పద్దతిని పాటించి కొత్త చేపట్టాలి.
10.  సిట్రస్ పండ్లు (మాల్టా, నిమ్మ, నారింజ మొదలైనవి) మరియు సమశీతోష్ణ పండ్లు
(ప్లం మొదలైనవి) ఎక్కువ షెల్ఫ్ జీవితాన్ని పెంచుటకు కాడతో  పాటు కోయాలి.
11. కోత  పద్ధతులతో పాటు, కోత దశ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది.
కోత తర్వాత నిర్వహణ మరియు నిల్వ సమయంలో పంట యొక్క ఉత్తమ నాణ్యత  కొరకు
పంట పరిపక్వత నిర్ధారణ అవసరం. దీనికోసం  వివిధ రకాల పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి.అవి పాటించడం వలన కొత్త అనంతరం కూడా మంచి నాణ్యత పాటించవచ్చు.

Also Read: మామిడి పండ్లలో రారాజుగా పేరుగాంచిన హాపస్ మామిడి

Leave Your Comments

Kashmir Apple: హిమపాతం కారణంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్న యాపిల్ రైతులు

Previous article

Silage: పాడి పశువులకు పచ్చడి తయారీ- సైలేజ్

Next article

You may also like