Yogurt And Cheese: పెరుగు మరియు జున్ను ఎగుమతి ఏప్రిల్-జనవరి 2013-14లో అమెరికా డాలర్ల ప్రకారం10 మిలియన్ల నుండి 2021-22 ఏప్రిల్-జనవరిలో 30 మిలియన్లకు పెరిగింది. ఇందులో యూఏఈ, బంగ్లాదేశ్, అమెరికా, భూటాన్, సింగపూర్, సౌదీ అరేబియా, మలేషియా, ఖతార్, ఒమన్ మరియు ఇండోనేషియా వంటి పాల ఉత్పత్తుల ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు ఉన్నాయి.
పాల ఉత్పత్తుల ఎగుమతులు గత ఐదేళ్లుగా 10.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. 2021-22 సంవత్సరంలో (ఏప్రిల్-నవంబర్) 181.75 మిలియన్ల విలువైన పాల ఉత్పత్తులు భారతదేశం నుండి ఎగుమతిజరిగింది. మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మునుపటి సంవత్సరం మొత్తం ఎగుమతి విలువను అధిగమించే అవకాశం ఉంది.
2020-21 సంవత్సరంలో భారతదేశం నుండి పాల ఉత్పత్తుల ఎగుమతులు ప్రధానంగా యుఎఇ (39.34 మిలియన్లు), బంగ్లాదేశ్ ( 24.13 మిలియన్లు), అమెరికా (22.8 మిలియన్లు), భూటాన్ (22.52 మిలియన్లు), సింగపూర్ (15.27 మిలియన్లు), సౌదీ అరేబియా (11.47 మిలియన్లు), మలేషియా (8.67 మిలియన్లు), ఖతార్ (8.49 మిలియన్లు), ఒమన్ (7.46 మిలియన్లు) మరియు ఇండోనేషియా (1.06 మిలియన్లు). 2020-21లో భారతదేశం నుండి డెయిరీ ఎగుమతుల్లో మొదటి పది దేశాల వాటా 61 శాతానికి పైగా ఉంది.