ఆరోగ్యం / జీవన విధానం

Tomato Health Benefits: టమాటాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

0

Tomato Health Benefits: టమాటాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అన్ని వంటకాల్లో వీటిని వినియోగిస్తారు. ఆహార రుచిని పెంచే టమాటాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. టమాటతో చట్నీ, కూర, సూప్, జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని సలాడ్ రూపంలో కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ టమాటా (Tomato) ల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు టమాటాలను క్రమం తప్పకుండా, సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

Tomato Health Benefits

Tomato Health Benefits

రోగనిరోధక శక్తి: ఈ కరోనా యుగంలో రోగనిరోధక శక్తి ప్రాముఖ్యత ఎంటో మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది శక్తిని పెంచడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు టమాటాల సహాయం తీసుకోవచ్చు. టొమాటో శరీరంలో విటమిన్ సి లోపాన్ని తీర్చడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటో రసం తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Also Read: రైతులు టమాట నర్సరీ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గి, కొద్ది రోజుల్లోనే స్థూలకాయాన్ని దూరం చేసుకోవచ్చు. టమాటా రసం తాగడమే కాకుండా తినడం కూడా మంచిదే. దీనివల్ల చర్మ సమస్యలు కూడా దూరమై మెరుస్తుంది.

Tomatos

Tomatos

వేడి: ఉదరంలో వేడి సమస్య వస్తే ఏమీ తినాలనిపించదు. మీకు కడుపులో వేడి, మంట సమస్య అనిపిస్తే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమాటా రసం తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో చల్లగా ఉంటుంది.. అలాగే రోజంతా మీరు మంచి అనుభూతి చెందుతారు. టమోటాలు తినడం వల్ల రోజంతా మీ శరీరంలో శక్తి ఉంటుంది.

Bunch of Tomato

Bunch of Tomato

కంటిచూపు: కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు, కాంతిని పెంచేందుకు పచ్చి కూరగాయలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటి చూపును మెరుగుపర్చడానికి ఖాళీ కడుపుతో టమాటాలు తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కళ్లే కాదు చర్మ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Also Read: పందిరి టమాట సాగు.. లాభాలు బహుబాగు

Leave Your Comments

Farmer success story: ఉపాధ్యాయ వృత్తిని వీడి ఆహార స్వరాజ్యం దిశగా అడుగులు

Previous article

Agricultural yield loss: దేశంలో దిగుబడి ఎందుకు తగ్గుతోంది

Next article

You may also like