ఆహారశుద్దిమన వ్యవసాయం

Coriander Ice Cream: కొత్తిమీర ఐస్ క్రీం తయారు చేసిన మెక్‌డొనాల్డ్స్

1
Coriander Ice Cream

Coriander Ice Cream: కొత్తిమీరను ఎక్కువగా భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. అలాగే కంటి సమస్యలు తగ్గుతాయంటారు. సాధారణంగా కొత్తిమీరను వంటకాలలో రుచి కోసం ఉపయోగిస్తుంటాం. కేవలం రుచి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అలాగే కొత్తిమీరతో అనేక ప్రయోజనాలుంటాయి. అయితే కొత్తిమీరను ఇలా కూడా వాడొచ్చని చెప్తుంది చైనా. చైనాలో ఓ ఫుడ్ సంస్థ చేసిన పనికి ఐస్ క్రీం లవర్స్ మండిపడుతున్నారు.

Coriander Ice Cream

ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలంటే అది చైనాకే సాధ్యం. వస్తువుల నుంచి, ఆహారం ఇలా ఏదైనా చైనా తన సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. అయితే తాజాగా చైనాలో ఒక బడా ఫుడ్ కంపెనీ నుండి సరికొత్త ఫుడ్ ని రిలీజ్ చేసింది. నిజానికి ఐస్ క్రీం అనేది ఒక ప్రత్యేకమైన వంటకం, ఇది అన్ని వయసుల వారికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఐస్ క్రీం రుచులలో అనేక విభిన్న వెర్షన్లు మరియు వైవిధ్యాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఐస్‌క్రీం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసింది. చైనాలోని మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) ఒక విచిత్రమైన కొత్తిమీర ఐస్‌క్రీమ్‌తో ముందుకు వచ్చింది. కొత్తిమీర సాస్ మరియు తరిగిన కొత్తిమీర ఆకులతో తయారు చేసిన కొత్తిమీర ఐస్ క్రీం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

mcdonalds Coriander Ice Cream

                            mcdonalds Coriander Ice Cream

విచిత్రమైన కొత్తిమీర ఐస్ క్రీం ఫోటోను యూజర్ డేనియల్ అహ్మద్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. మెక్‌డొనాల్డ్స్ చైనా ఈ రోజు కొత్తిమీర సండే ప్రత్యేక మెను ఐటెమ్‌ను ప్రారంభించింది. ఇది ఆసక్తికరంగా ఉంది అని ఆయన తన ట్వీట్‌లో రాశారు. పోస్ట్‌కి 2.3k పైగా లైక్‌లు మరియు వందల కొద్దీ రీట్వీట్‌లు వచ్చాయి. కాగా ఇదివరకు మెక్‌డొనాల్డ్స్ థాయిలాండ్‌లో చిల్లీ పేస్ట్ మరియు పోర్క్‌తో తయారు చేసిన విచిత్రమైన ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసిందని వార్తలు వచ్చాయి.

Leave Your Comments

Organic Product: సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ 51 శాతం వృద్ధి

Previous article

Aamir Khan: సోయాబీన్ ఉత్పత్తిపై అమీర్ ఖాన్ పానీ ఫౌండేషన్ ఈ బుక్‌లెట్‌ రెడీ

Next article

You may also like