రైతులు

PMKSY-PDMC : వివిధ నీటి పారుదల పరికరాల పై ప్రభుత్వం 55% సబ్సిడీ

0
PMKSY-PDMC

PMKSY-PDMC: వ్యవసాయం మరియు రైతు సంక్షేమశాఖ (DA&FW) భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో 2015-16 నుండి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY-PDMC) యొక్క పర్డ్రాప్మోర్క్రాప్కాంపోనెంట్‌ను ప్రారంభించిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం పై ఈ పథకం దృష్టి సారిస్తే డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్లను ఇన్‌స్టాల్చేసుకు నేలా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచిక యూనిట్ధరలో 55 శాతం మరియు ఇతర సాగు దారులకు 45 శాతం సబ్సిడీ లేదా ఆర్థిక సహాయం అందిస్తుంది.

PMKSY-PDMC

అదనంగా, కొన్ని రాష్ట్రాలు మైక్రో ఇరిగేషన్‌ను స్వీకరించ డానికి రైతుల వాటాను తగ్గించడానికి అదనపు ప్రోత్సాహకాలు లేదా టాప్-అప్ సబ్సిడీని అందిస్తాయి. ఇప్పటి వరకు, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 1, 85,235 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) ద్వారా రైతులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సబ్సిడీని విడుదల చేస్తారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన లక్ష్యం/ నినాదం ఏమిటి ? “హర్ఖేత్కోపానీ” నినాదంతో 1 జూలై 2015న ప్రారంభించబడిన ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) సాగు విస్తీర్ణాన్ని నిర్ధారిత నీటిపారుదలతో విస్తరించడానికి, నీటి వృధాను తగ్గించ డానికి మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి అమలు చేయబడుతోంది.

PMKSY- PDMC అనేది కేంద్ర ప్రాయోజిత పథకం మరియు ఈ పథకం కింద నిధులు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో పంచబడతాయి, ఇందులో భాగస్వామ్య విధానం 90:10. కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో, నిధుల విధానం 100% కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

సబ్సిడీ కోసం అవసరమైన పత్రాలు రైతులు తప్పని సరిగా కలిగి ఉండాలి- ఆధార్కార్డ్, బ్యాంకు పాస్ బుక్ మెదటి పేజీ యొక్క ఫోటో కాపీ,  కులధృ వీకరణ, విద్యుత్ బిల్లు వంటి విద్యుత్ కనెక్షన్ రుజువు, OTP కోసం మొబైల్ నెంబర్.

PMKSY-PDMC

ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

రైతులు ఆన్ లైన్ లేదా అఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు–క్రింద మేము రెండు పద్ధతులను పేరు కొన్నాము.

ఆఫ్ లైన్ ప్రక్రియ:
మీరు సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని లేదా జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యానవన అధికారిని సందర్శించవచ్చు.

ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ క్రింది విధంగా ఉంది; ముందుగా, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి హోమ్పేజీలోకి లాగిన్ ఎంపిక పై క్లిక్ చేయండి . మీరు మీ పేరు లేదా ఇమెయిల్ఐడి ద్వారా లాగిన్చేయ వచ్చు ఇప్పుడు సంబంధిత లింక్‌ ను ఎంచుకోండి PDF మార్గ దర్శకం నుండి సమాచారాన్ని తీసుకొని దరఖాస్తు చేయండి.

Leave Your Comments

Chilli Crop and Remedies: మిర్చి పంటలో తామర పురుగు లక్షణాలు మరియు నివారణ మార్గాలు

Previous article

Cultivation of Paddy : వేద విధానంలో వరి సాగు.…“ఆదాయం బహు బాగు”!

Next article

You may also like