రైతులు

Success story: అడుగు ఎతైన చెరకు తోట- కుబేరుడైన రైతు

0

Sugarcane సాధారణంగా చెరకు తోట 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. సారవంతమైన భూమి, సరైన పోషకాలు మొక్కకు అందితే మరో రెండు మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ రైతు మాత్రం 21 అడుగుల ఎత్తైన చెరకు పంటను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

మహమ్మద్‌ మొబీన్‌… ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లా థాన్వాలా గ్రామానికి చెందిన రైతు. మొబీన్‌ తనకు ఉన్న పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బంగాళదుంప, క్యాలీ ఫ్లవర్, క్యాబేజీతోపాటు కీరదోస వంటి పంటలను సాగుచేస్తున్నాడు. ఈసారి చెరకు తోటను వేయగా బాగా దిగుబడి వచ్చింది. సాధారణంగా తోటలోని ఒక్కో చెరకు గడ 10 అడుగుల మేర పెరుగుతుంది. కానీ మొబీన్‌ పండించిన చెరకు గడ ఒక్కొక్కటీ 21 అడుగుల పొడుగు వరకు పెరగగా.. భారీ లాభాలను ఆర్జించాడు. సెప్టెంబర్ 18న ఈ చెరకు పంటను వేసినట్లు మొబీన్ తెలిపాడు. ప్రతీ బిఘా వైశాల్యంలో 13 టన్నుల చెరకు దిగుబడి వచ్చినట్లు వివరించాడు.

చెరకు గడలు 21 అడుగుల ఎత్తు పెరగడం వల్ల అవి పడిపోకుండా మొబీన్ అన్ని జాగ్రత్తల తీసుకున్నాడు. చెరకు గడలకు సాయంగా కర్రలను కట్టాడు. తరచూ పంటమార్పిడి చేయడం వల్ల దిగుబడి పెరుతోందని మొబీన్ పేర్కొన్నాడు. తాను సాగుచేసిన ఎత్తైన చెరకు పంటను చూసేందుకు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పరిసర గ్రామాల ప్రజలు వస్తున్నారని.. సాగు విధానాన్ని అడిగి తెలుసుకుంటున్నారని మొబీన్ తెలిపాడు.

Leave Your Comments

Basmati Rice: బాస్మతి బియ్యానికి పెరుగుతున్న డిమాండ్

Previous article

Bhendi yellow vein mosaic virus: బెండ లో పల్లాకు తెగులు మరియు యాజమాన్యం

Next article

You may also like