ఆరోగ్యం / జీవన విధానం

Benefits of pomegranate peels: దానిమ్మ తోలు తో లెక్కలేనన్ని ప్రయోజనాలు

1

Pomegranate కాలంతో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్ల‌లో దానిమ్మ ఒక‌టి. ఎర్ర‌గా చూడ‌గానే నోరురూరించే దానిమ్మ పండ్లు కేవ‌లం రుచికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇక దానిమ్మ తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

దానిమ్మ గింజలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దానిమ్మ గింజల్లో విటమిన్లు బి,సి,కెలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.  శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దానిమ్మ గింజలు కీ రోల్ పోషిస్తాయి. కాలంతో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్ల‌లో దానిమ్మ ఒక‌టి. అయితే దానిమ్మ గింజలు ఒలుచుకుని తిన్నాక తొక్కలను చాలామంది డస్ట్‌బిన్‌లో పడేస్తారు. అయితే ఆ తొక్కల వల్ల మీరు నమ్మలేని ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ తొక్కును ఎండబెట్టి పొడి చేసుకొని.. ఎన్నో సమస్యలకు = వినియోగించవచ్చు.

ప్రయోజనాలు:

  • దానిమ్మ తొక్కలో సన్ స్క్రీన్ లోషన్ వంటి గుణం ఉంటుంది. సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన అల్ట్రా వేవ్ కిరణాల నుంచి మీ చర్మానికి దానిమ్మ తొక్కు రక్షణ ఇస్తుంది.
  •  దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి అందులో రోజ్ వాటర్ క‌లిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. చ‌ర్మానికి నిగారింపు వ‌చ్చి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.
  • నోటి పరిశుభ్రతను కాపాడుకునేందుకు సహాయపడే అనేక లక్షణాలు దానిమ్మ తొక్కులో ఉన్నాయి. దానిమ్మ తొక్కు పొడిని నీటిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.

  • దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దానిమ్మ తొక్క తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి తగ్గుతాయి.
  •  దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి, పొడిగా మార్చి.. ఆ పొడిని గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెలో క‌లుపుకొని మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించాలి. అనంత‌రం ఓ 15 నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.. ఇలా త‌రుచూ చేస్తుంటే చుండ్రు స‌మ‌స్య తగ్గుతుంది.

  • గాయాలు, పుండ్లకు కూడా దానిమ్మ తొక్కలు మంచి మెడిసిన్‌లా  పనిచేస్తాయి. వీటిని మెత్తని పేస్టులా చేసి గాయాలకు పెడితే త్వరగా మానిపోతాయి.
  • మొటిమలు పోగొట్టే గుణం కూడా దానిమ్మ తొక్కలకు ఉంది. దానిమ్మ తొక్కల పొడిని.. రెండు రోజులకోసారి నీళ్లలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

 

 

Leave Your Comments

Guava Health Benefits: జామ పండ్లే కాదండోయ్.. జామ ఆకులు ఆరోగ్యానికే మేలే

Previous article

Nursery raising in tomato: రైతులు టమాట నర్సరీ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like