జాతీయంవార్తలు

Bamboo Cultivation: వెదురే బంగారమాయే.. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం

0
Bamboo
Bamboo

Bamboo Cultivation: వెదురు పంటకు త్వరలో డిమాండ్ పెరగనుంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్య నియంత్రణకు బొగ్గుకు బదులు వెదురు గుళికలు ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో వెదురుకు భారీ డిమాండ్ పెరగనుంది. వెదురు గుళికలు వినియోగించాలంటే 24.74 లక్షల టన్నుల వెదురు బొంగులు అవసరం.

Bamboo

Bamboo

దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ వెదురు పంటకు భారీగా డిమాండ్‌ పెరగనుంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్య నియంత్రణకు బొగ్గుకు బదులు వెదురు గుళికలు(పిల్లెట్లు) తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర కొత్త ఇంధన విధానమే దీనికి కారణం. బొగ్గు వినియోగం వల్ల ఏటా 21 లక్షల టన్నులకు పైగా బొగ్గు పులుసు వాయువు(సీఓ2) వాతావరణంలోకి విడుదలవుతున్నందున దేశవ్యాప్తంగా పర్యావరణం కలుషితమవుతోందని కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో బొగ్గు మండించే సమయంలో ఈ గుళికలను ఏడు శాతం వాడాలని ‘జాతీయ ఇంధన విధానం’లో కేంద్రం స్పష్టం చేసింది.

Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగ లో విత్తనశుద్ధి తో తెగుళ్ళ కు చెక్

21 లక్షల టన్నులు అవసరం

 రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో వెదురు గుళికలు వినియోగించాలంటే 24.74 లక్షల టన్నుల వెదురు బొంగులు అవసరం. దీని మార్కెట్‌ విలువ రూ.2,969.85 కోట్లని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. సుమారు లక్ష ఎకరాల్లో వెదురు సాగు చేస్తే విద్యుత్కేంద్రాలకు అవసరమైన వెదురు లభిస్తుందని ప్రభుత్వానికి సూచించింది. ఎకరా వెదురు సాగుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి అవుతుంది. వెదురు ఏపుగా పెరిగితే ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఆదాయం వస్తుంది.

నెలకు 26 వేల టన్నులు కావాలంటున్న జిందాల్

ఒడిశాలోని అంగూల్‌ ప్రాంతంలో ఒక్కోటీ 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రెండు థర్మల్‌ కేంద్రాలు నిర్మిస్తున్న ‘జిందాల్‌ ఇండియా థర్మల్‌ పవర్‌ కంపెనీ’ నెలకు 26 వేల టన్నుల వెదురు గుళికలు కావాలని తాజాగా టెండర్లు పిలిచింది

Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Leave Your Comments

Bay Leaf Health Benefits: ఈ ఒక్క ఆకు ఎన్నో సమస్యలకు దివ్య ఔషధం

Previous article

Mango powdery mildew: మామిడిలో బూజు తెగుల– రైతులు ఇలా చెయ్యండి

Next article

You may also like