History Of Potato: నేడు గోధుమ, మొక్కజొన్న, వరి మరియు చెరకు తర్వాత బంగాళాదుంప ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ముఖ్యమైన పంట. అయితే బంగాళాదుంప మనదేశ పంట కాదన్నది చాలామందికి తెలియని నిజం. నిజానికి ఇది దక్షిణ అమెరికాలో మొదటిసారిగా పండించారు. దాదాపు 15వ శతాబ్ద కాలంలో దీన్ని దక్షిణ అమెరికాలో పండిస్తున్నట్లు 1537లో కనుగొన్నారు. కాగా ఇది అమెరికా నుంచి యూరప్ నుంచి మన దేశంలో అడుగుపెట్టింది. బంగాళదుంప మనదేశానికి 17వ శతాబ్దంలో వచ్చినట్లు చరిత్ర చెప్తుంది. అయితే అది పోర్చుగల్ నావికుల ద్వారా మనదేశానికి వచ్చినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో దీన్ని పండిస్తున్నారు. ఇది భారతదేశంలో వరి, గోధుమ, జొన్న తర్వాత అత్యధికంగా పండించే పంట. ప్రపంచంలో చైనా, భారతదేశం, పోలండ్, అమెరికాలో అత్యధికంగా దీన్ని సాగు చేస్తున్నారు రైతులు. అయితే బంగాళాదుంపను ఎక్కువగా బెంగాలీ, ఒడియా, ఉత్తరాదిలో రాష్ట్రాల్లో దీన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. విశేషం ఏంటంటే బంగాళాదుంపను మన దేశంలో కొన్న్ని రాష్ట్రాల్లో నాన్ వెజ్ లలోను ప్రధానంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బిరియాని, చికెన్, మటన్, చేపల కూరల్లో వాడుతారు. అందులో బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు ప్రధానంగా బంగాళాదుంపను నాన్ వెజ్ లో వాడుతున్నారు.
Also Read: షుగర్ ఫ్రీ బంగాళదుంపల సాగుతో ఎన్నో లాభాలు
ప్రస్తుతం బంగాళదుంపని ఆహారంలో విరివిగా వాడుతున్నారు. 1970లో 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్న బంగాళాదుంప 2003 నాటికి 25 మిలియన్ టన్నులకు చేరినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీన్ని 100 కోట్లకు మందికి పైగా వాడుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దీన్ని మనదేశంలో అనేక రకాల వంటకాలలో వాడుతున్నారు. అంచనా ప్రకారం దాదాపుగా 100 రకాలకు పైగా వంటకాలలో దీన్ని వినియోగిస్తున్నారు. ఇకపోతే బంగాళాదుంపను వేపుడు, ఆలూ సమోసా, ఆలూ కుల్చా, పావ్ భాజీలో , ఆలూ చాట్, మసాలా దోశలో , వడా పావ్ లో , పూరీ కూరలో ఇష్టంగా తింటారు ఫుడ్ లవర్స్.
అయితే మనదేశంలో ప్రస్తుతం ప్రధానంగా వినియోగించే ఆహారపంటలలో అనేక రకాల పంటలు ఇతర దేశాల నుంచి వచ్చినవే. బంగాళాదుంపలతో పాటు టమాటా, పచ్చిమిర్చి, కేబేజీ, కాలిఫ్లవర్ లాంటి ఎన్నో ఆహార పదార్ధాలు ఇతర దేశాల నుంచి వచ్చినవే. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న ఆహార సరఫరాల్లో 68.7%, ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో69.3 శాతం విదేశీ కాయగూరలేనని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.
Also Read: టమాటాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు