Spirulina Farming: సంప్రదాయంగా మట్టిలో చేసే వ్యవసాయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటంతో మహారాష్ట్రకు చెందిన సిద్దాంత్ జాదవ్ అనే యువ రైతు నీటిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 2016 నుంచి అయన స్పిరులినా పండిస్తున్నారు. దీనిపై జాదవ్ మాట్లాడుతూ… 2015 లో చదువు పూర్తి చేసుకున్నాను. అప్పట్లో పుదుచ్చేరి, అహ్మదానగర్లో స్పిరులినా పండించడం చూశాను. అది చూసి మా ప్రాంతంలో కూడా ఏదైనా వినూత్నంగా చేయాలని అనిపించింది. అలా నేను స్పిరులినా సాగు మార్గాన్ని ఎంచుకున్నాను.
2016 లో జాదవ్ 1000 చదరపు అడుగుల స్థలంలో స్పిరులినా పండించడం ప్రారంభించాడు. దీంతో పాటు ఆయన స్పిరులినా ట్యాబ్లేట్లను కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు. నిజానికి స్పిరులినా నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. ప్రజలు ఈ స్పిరోలినా ట్యాబ్లేట్లను సప్లిమెంటరీ డైట్లో భాగంగా తీసుకుంటారు.
Also Read: భవిష్యత్తులో సగం ఆహారం సముద్రాల నుంచే వస్తుంది
ఇది నీటిలో మాత్రమే పెరుగుతుంది. నాణ్యమైన నీటిని, సరైన ఎరువులను మోతాదులో అందిస్తే ఆల్గె వేగంగా వృద్ధి చెందుతుంది. ఎక్కువ కాలంపాటు దిగుబడి ఉంటుంది. వాతావరణ మార్పులు ఈ సాగుపై అస్సలు పడదు. అన్ని సీజన్లోనూ పంట దిగుబడి బాగానే వస్తుంది. నిజానికి ఈ పంట సాగుకు అలవాటు పడేందుకు సిద్దాంత్ కు రెండేళ్ల సమయం పట్టిందని చెప్తున్నాడు. ఆ తర్వాత స్పిరులినా మార్కెటింగ్ పై ద్రుష్టి పెట్టారు. ఇప్పుడు అయన 5 వేల చదరపు అడుగుల స్థలంలో స్పిరులినా పండిస్తున్నారు.
1000 లీటర్ల నీటిని ఉపయోగిస్తే ఒక నెలలో కిలో స్పిరులినా పౌడర్ వస్తుంది. అయితే నెలలో ఎన్ని ట్యాంకుల్లో పండిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మా యూనిట్లో 20 కిలోల పౌడర్ వస్తుంది. ఒకవేళ 1000 చదరపు అడుగుల స్థలంలో దీన్ని ప్రారంభించాలి అనుకుంటే సులువుగా మీరు 25 వేల నుంచి 50 వేలు సంపాదించవచ్చని అంటున్నారు సిద్ధాంత్. దీన్ని ఆరుబయట కాకుండా మూసి ఉన్న ప్రాంతాల్లోనే చేయాలనీ అప్పుడే అది మారుతున్న వాతావరణ పరిస్థితులకు గురి కాదని నిపుణులు చెప్తున్నారు. ఇది భవిష్యత్తు వ్యవసాయమని మరికొందరు అంటున్నారు.
Also Read: బెండ పంట లో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు యాజమాన్యం