Sujani’s Eden Garden: గృహిణులకు టెర్రస్ గార్డెనింగ్ అనేది వ్యాపకంలా మారింది. జీవితంలో గార్డెనింగ్ కూడా సగభాగం చేసుకుంటున్నారు కొందరు ఆదర్శ మహిళలు. నగరంలో తక్కువ విస్తీర్ణంలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు పండిస్తున్నారు. రసాయన ఎరువులతో కాకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్నారు. అయితే సొంతింటిలో సాగు చేయడం ఒక పద్దతి అయితే అద్దె ఇంట్లో కూడా గార్డెనింగ్ చేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమే. హైదరాబాద్ లోని వెంగళ్‌రావు నగర్‌లో నివాసం ఉంటున్న సుజనీరెడ్డి తన అద్దె ఇంట్లో టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టి పండ్లు, కూరగాయ మొక్కలు పెంచుతున్నారు.
సుజనీరెడ్డి… తన ఈడెన్ గార్డెన్ 90% సేంద్రీయ మరియు తాజా కూరగాయలు మాత్రమే కాకుండా తియ్యని పండ్లు మరియు రంగురంగుల పూల బొకేలతో కూడా విరాజిల్లుతోంది. సుజనీరెడ్డి ఆమె ఓ మైక్రోబయాలజిస్ట్. ఎం.ఎస్.సి కెమిస్ట్రీలో చేరారు. కానీ పెళ్లి, పిల్లలతో మధ్యలోనే చదువు ఆపాల్సి వచ్చింది. తనకు చిన్ననాటి నుండి మట్టితో ఉండటం అంటే ఎంతో ఇష్టమని చెప్తున్నారు. పచ్చని మొక్కలు, ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఒదిగిపోవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమెను సైన్స్ వృత్తిలో భాగం చేసిందని చెప్తున్నారు సుజనీ.
Also Read: ఇలా కూడా మిద్దె తోట ప్రారంభించొచ్చు !
నా టెర్రస్ గార్డెన్ దాదాపు 200 చదరపు అడుగులు ఉంటుంది. నేను ప్రతి మొక్కను ఒక కంటైనర్లలో పెంచుతారు. వేళ్లతో సంక్రమించే వ్యాధులను నివారించడానికి నేను నాటేటప్పుడు వేపపిండిని మట్టిలో కలుపుతాను. నీళ్ళు పోసేటప్పుడు చీడపీడలు ఉన్నాయేమోనని నేను రోజూ చూస్తూ వాటిని చేతితో తొలగిస్తాను. శిలీంధ్ర వ్యాధులు రాకుండా వర్షం పడిన తర్వాత పుల్లని మజ్జిగ కూడా పిచికారీ చేస్తున్నాను అని చెప్తున్నారు ఆమె.
ఇక ఆమె గార్డెనింగ్ కి సంబంధించిన వర్క్‌షాపులకు కూడా హాజరయ్యేవారు. ఫార్మింగ్ కు సంబంధించిన చాలా రకాల పుస్తకాలను చదివారు. ఆ అనుభవంతో టెర్రస్ గార్డెన్ ప్రారంభించారు. ఈ గార్డెన్ కోసం ఆమె తన ఇంట్లోని పాత పాత్రలను కుండీలుగా మార్చారు.
తన గార్డెన్ లో టొమాటోలు, పచ్చి మిర్చితో పాటు, చైనీస్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, ముల్లంగి, వెల్లుల్లి, ఉల్లి, బీన్స్, గ్రీన్ క్యాప్సికమ్, ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ వంటి పాదులు పెంచుతున్నారు. ఆమె గార్డెన్లో 40 శాతం మట్టి, 40 శాతం వెర్మి కంపోస్టు, 10 శాతం కొబ్బరి పీచు, 10 శాతం వేప పిండి వంటివి ఉపయోగించి మొక్కలు పెంచడం ప్రారంభించారు.
Also Read: మిద్దె తోటల పెంపకంపై ఆదరణ…