రైతులుసేంద్రియ వ్యవసాయం

Chemical Free Farming: సేంద్రియ వ్యవసాయానికి యువ రైతుల కృషి

1
Organic Farming

Chemical Free Farming: దేశంలో సేంద్రియ వ్యవసాయానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. దీంతో రసాయన రహిత వ్యవసాయం వైపు అడుగులు పడుతున్నాయి. అటు ప్రభుత్వాలు కూడా సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ సేంద్రియ వ్యవసాయం గురించి జాతినుద్దేశించి మాట్లాడారు. రసాయన రహిత వ్యవసాయం చేయాలనీ మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు, యువత ముందడుగేస్తున్నారు. రసాయన ఆహార పంటలతో పెరుగుతున్న వ్యాధుల నుండి మానవాళిని రక్షించడానికి ఇప్పుడు యువ రైతులు సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.

Organic Farming

మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన యువకులు సంజయ్, శర్మ, హిమాన్షు చతుర్వేది, అభినవ్ తివారీల సంయుక్త కృషితో కామధేను కృషక్ కళ్యాణ్ సమితి ద్వారా స్థానిక జైత్వారా-బీర్‌సింగ్‌పూర్ రోడ్డులో మోడల్ ఆర్గానిక్ ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా సంప్రదాయ వ్యవసాయం కాకుండా సహజసిద్ధమైన ఆవు ఆధారిత వ్యవసాయం చేసే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు.

అయితే ఆ యువకులు కృష్ణా నగర్‌లోని సరస్వతి శిశు మందిర్‌లోని ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వారిలో ఒకరు పశ్చిమ మధ్య రైల్వేలో రైలు మేనేజర్, మరొకరు అంతర్జాతీయ కంపెనీలో మరియు BSNLలో SDO గా పని చేస్తున్నారు.

Chemical Free Farming

ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న హిమాన్షు చతుర్వేది ప్రభుత్వ పథకాల సాయంతో ఈ మిషన్‌ను ప్రారంభించారు. పని చేస్తున్నప్పుడు, ఔషధ కంపెనీల లాభాలు మరియు తీవ్రమైన వ్యాధులు (క్యాన్సర్, షుగర్, రక్తపోటు) గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగాయని అతను కనుగొన్నాడు. రోగాలకు మూలకారణమైన మందులు ఎక్కువగా కొనే బదులు ప్రజలకు మంచి ఆహారం ఎందుకు అందించడం లేదని ఆలోచించాడు.

Organic Farming

గత 2 సంవత్సరాలలో కోవిడ్ లాక్‌డౌన్‌లో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ స్నేహితులు సేంద్రీయ వ్యవసాయ విధానంతో స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రారంభంలో అతను బగాహాలోని కేశవ్ మాధవ్ గౌశాల నుండి సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాడు. ఇప్పుడు అదే పనిని బాముర్హలో భారీ స్థాయిలో చేస్తున్నారు. పసుపు, ఉల్లి, బంగాళదుంప ఆహార పంటలను వర్మీ కంపోస్ట్, వానపాములతో ఉత్పత్తి చేస్తున్నారు. కాగా తమ ఉత్పత్తులను విక్రయించడంతోపాటు ఈ కేంద్రంలో ఎప్పటికప్పుడు ఉచిత శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు.

ఆ స్నేహితుల కృషితో సాత్నాలో ఉన్న ఉద్యానవన శాఖ ద్వారా ప్రజలు అనేక పథకాలను సద్వినియోగం చేసుకున్నారు, ఇందులో మెరుగైన విత్తనాలు, మొక్కలు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు మరియు నీటిపారుదల కోసం స్ప్రింక్లర్లు ప్రముఖమైనవి.

Leave Your Comments

Fall Armyworm: వాతావరణ మార్పుల కారణంగా మొక్కజొన్న పంటకు తెగుళ్లు

Previous article

Dairy Farmer Protest: మహారాష్ట్ర మద్యం పాలసీపై పాల వ్యాపారులు ఫైర్

Next article

You may also like