Fall Armyworm: మహారాష్ట్రలో మారుతున్న వాతావరణం కారణంగా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయి.ఇప్పుడు జలగంతోపాటు ఇతర జిల్లాల్లో వాతావరణ మార్పుల కారణంగా మొక్కజొన్న పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. పంటలకు తెగుళ్లు, ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయి. పురుగు మందులు పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత మళ్లీ పంటల్లో ఈ తెగులు ఉధృతి పెరుగుతుందని.. సరైన నిర్వహణ ఉన్నప్పటికీ చీడపీడల ఉధృతి ఆగడం లేదని.. లార్వాల ఉధృతి కూడా పెరుగుతోందని రైతులు చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గడం వల్ల రైతులు లక్షల్లో నష్టపోతున్నారు.
మొక్కజొన్న పంటకు వ్యాధి సోకడంతో ఉత్పత్తి దెబ్బతింటోంది. తన రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశానని, అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉందని షోలాపూర్ రైతు సంతోష్ జాదవ్ తెలిపారు. మారుతున్న వాతావరణం వల్ల పంటలపై ఆర్మీ వార్మ్ తెగుళ్లు పెరగడం ప్రారంభమైంది, ఆ తర్వాత ఖరీదైన పురుగుమందులు పిచికారీ చేసిన తర్వాత కూడా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు రైతు. ఇప్పుడు పంటలన్నీ పాడైపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. కాగా ప్రభుత్వం నుంచి సబ్సిడీపై పురుగుమందు లభ్యం కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మొక్కజొన్న సాగు చేయడం వల్ల పశువులకు మేత సమస్య కొంతమేరకు పరిష్కారం కావడంతో వేసవి కాలంలో మొక్కజొన్నను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు. దీంతో రైతులు సాగుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులకు ఎకరాకు 300 నుండి 400 రూపాయలు ఖర్చు అవుతుంది.ఇదిలావుండగా 15 రోజులకోసారి పురుగుల ఉధృతి పెరుగుతోందని, దీంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో పంట ఎదుగుదల ఆగిపోవడంతో పశుగ్రాసం సమస్య తీవ్రంగా మారుతుందని రైతులు భయపడుతున్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో ఈ రకమైన సమస్య కనిపిస్తోంది.