ఆరోగ్యం / జీవన విధానం

Pumpkin Seeds health benefits: గుమ్మడి గింజలతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

1

Pumpkin Seeds సాధారణంగా గుమ్మడి కాయను  ఇంటి ముందు గడప దగ్గర కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు

సాధారణంగా గుమ్మడి కాయను (Pumpkin  ) ఇంటి ముందు గడప దగ్గర కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలాగే శుభకార్యాల సమయాలలో వీటిని వాడుతుంటారు. కొందరు మాత్రమే గుమ్మడి కాయతో వంటకాలు చేసుకుంటుంటారు. ఎక్కువ శాతం మంది గుమ్మడి కాయను తినడానికి సుముఖంగా ఉండరు. కానీ గుమ్మడి కాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా.. గుమ్మడి గింజలు (Pumpkin Seeds) కూడా ఆరోగ్యానికి మంచివి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి, పొట్టకు, ఇతర శరీర అవయవాలకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ముఖ్యంగా స్త్రీలకు గుమ్మడి గింజలు మంచివి. మహిళలకు పీరియడ్స్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. వ్యాయమశాల డైరెక్టర్ మిస్టర్ . ఫిట్బీ.. గుమ్మడి గింజలు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లేమేటరీ ఉన్న మహిళలకు ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలను గనేరియాతో బాధపడుతున్న మహిళలకు ఇవ్వడం వలన అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. ఇందులో కుకుర్బిటాసిన్ అనే ప్రత్యేకమైన ఆమ్లం ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే గుమ్మడి గింజలు శరీరంలోని కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలకు అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుమ్మడి గింజలలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. మహిళలలో ఒవేరియన్ సిండ్రోమ్ వలన కలిగే రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే మహిళలు గుమ్మడి గింజలను తింటే ఆస్టియోపోరోసిస్ సమస్య తగ్గుతుంది. గుమ్మడి గాయ గింజలు ఎముకల వ్యాధిని తగ్గిస్తాయి.

Leave Your Comments

Strategies for drought management: కరువు సమయం లో పంటలలో చెయ్యవలసిన పనులు

Previous article

Soil fertility: నేలతల్లి పోషకాలకు కల్పవృక్షం

Next article

You may also like