Farmer Success Story: బీహార్లోని బెగుసరాయ్ జిల్లా సహపూర్ గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ కన్హయ్య వ్యవసాయంలో పట్టభద్రుడయ్యాక 12 ఏళ్లుగా వ్యవసాయానికి సంబంధించిన రిపోర్టింగ్లు చేస్తూనే ఉన్నాడు. అంటే టీవీ జర్నలిజం ద్వారా రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడు. కానీ 2012లో ఢిల్లీ నుండి జర్నలిజం వదిలి బెగుసరాయ్ లోని తన గ్రామానికి చేరుకుని అక్కడ సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించడం ప్రారంభించాడు. ఒకప్పుడు బ్యాంకులో రూ.10 లక్షలు అప్పు చేసి వ్యవసాయం ప్రారంభించాడు.
అయితే కృష్ణ కుమార్ కన్హయ్య ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. చివరికి అనారోగ్యానికి గురయ్యాడు. ఒకానొక సందర్భంలో హార్ట్ సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని, అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో బ్యాంకు ఒత్తిడితో భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు. ఆ తర్వాత రుణం చెల్లించిన ఆయన పట్టు వదలలేదు. బీహార్ నుంచి జార్ఖండ్ వెళ్లి రైతులకు అవగాహన కల్పించారు. ఇప్పుడు దేవఘర్లో 10 వేల చదరపు మీటర్లలో నర్సరీ ప్రారంభించాడు. ఏటా 18 నుంచి 20 లక్షల రూపాయల ఆదాయం కూడా వస్తోంది. దీంతో పాటు చుట్టుపక్కల 6 జిల్లాలకు చెందిన వేలాది మంది రైతులకు సేంద్రియ వ్యవసాయంలోని విశేషాలను తెలియజేస్తున్నారు.
జార్ఖండ్లో గొడ్డ జిల్లాలో ఒకప్పుడు అత్యధికంగా వరి సాగు చేసేవారు. కానీ కొన్ని ఏళ్ళ నుంచి రైతులు వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగాల కోసం ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ప్రారంభించారు. కానీ వాణిజ్య పంటల గురించి అవగాహన కల్పించడం ద్వారా రైతులకు బాగా సంపాదించే మెళుకువలు నేర్పించాడు కృష్ణ కుమార్ కన్హయ్య . ఇప్పుడు ఆ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో వరి, బొప్పాయి, ఇతర పండ్ల సాగు మొదలైంది. ఈ క్రమంలో అతని నర్సరీ ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపాడు కన్హయ్య . ప్రస్తుతం ఏటా రూ.18 నుంచి 25 లక్షల ఆదాయం వస్తోందన్నారు కన్హయ్య. కాగా.. రైతులు వరి, గోధుమలకు బదులు పండ్ల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టాలని, అప్పుడే తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని కృష్ణ కుమార్ కన్హయ్య చెప్పారు.