Neem Trees: వేప గాలితో మనలో సగం రోగాలు నయమవుతాయంటారు మన పెద్దలు. వేపాకు వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలున్నాయి. కానీ ప్రస్తుతం వేపకి కూడా దోమ బెడద పట్టుకుంది. ప్రస్తుతం ఈ చెట్లు డై బ్యాక్ అనే శిలీంద్ర సంబంధమైన తెగులుతోపాటు టీ మస్కిటో అనే దోమ దాడికి గురవుతున్నాయి. అయితే ఈ తరహా దోమ సోకితే వేప కొన్ని చోట్ల చిగుర్లు ఎండిపోతే, మరికొన్ని చోట్ల నిలువునా వేప చెట్లు ఎండిపోతున్నాయి. సేంద్రియ, పకృతి వ్యవసాయంలో చీడపీడల నియంత్రణలో కీలకపాత్ర నిర్వహించే వేప చెట్లను కోల్పోతే భవిష్యత్లో అనేక నష్టాలను చూడాల్సి వస్తుంది. మరి వేపను కాపాడుకోవాలంటే దానికి హోమియోపతి మందు అవసరం అంటున్నారు నిపుణులు.
Also Read: చేదు వేపకు.. చెడ్డ రోగం.!
క్యూప్రమ్ మెట్ 200 ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, పిచికారీ చేస్తే టీ మస్కిటో దోమ నశిస్తుంది. దీన్ని పిచికారీ చేసిన రెండు రోజుల తర్వాత కొక్సీనెల్లా 200 అనే ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, నీటిలో కలిపి వేప చెట్లపై పిచికారీ చేయడం లేదా చెట్టు మొదలు చుట్టూ పాదు చేసి పొయ్యొచ్చు. ముందుగా చెట్టు చుట్టూ పాదును మామూలు నీటితో నిండుగా తడిపిన తర్వాత.. మందు కలిపిన నీరు చెట్టుకు పది లీటర్లయినా సరిపోతుంది. చెట్టు మరీ పెద్దదైతే ఇరువై లీటర్ల వరకూ పోసుకోవచ్చు. ఒక దఫా ఈ రెండు మందులు వాడిన తర్వాత.. 8 రోజులు వేచి చూడండి. అవసరం అనుకుంటే మరోసారి వాడండి.
వేపకు ఆ దోమ సోకితే హోమియోపతి మందు వాడే విధానం:
20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల (ఎం.ఎల్.) మోతాదులో హోమియో మందును కలిపి వాడాలి. అలాగే ఒక లీటరు సీసా లేదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అందులో సగం వరకు నీరు నింపుకోవాలి. అందులో 2.5 మిల్లీలీటర్ల (ఎం.ఎల్.) మందు కలిపి, మూత బిగించి, 50 సార్లు గట్టిగా ఊపాలి. ఆ తర్వాత ఆ మందును స్ప్రేయర్ ట్యాంకులో పోసుకొని 20 లీటర్ల నీరు నింపి దోమ సోకినా వేపకు పిచికారీ చేసుకోవాలి. ఈ విధానం ద్వారా వేపను కాపాడుకోవచ్చని అంటున్నారు హోమియో నిపుణులు.
Also Read: వేపనూనెతో మొక్కలకు ఎంతో మేలు..