World Bank Internship 2022: ప్రపంచ బ్యాంక్ తన సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022 కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇంటర్న్‌షిప్ మే నుండి సెప్టెంబర్ వరకు ఐదు నెలల పాటు కొనసాగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే దీనికి సమయం నేటితో ముగుస్తుంది. చివరి తేదీ జనవరి 31, 2022. ఇది ఒక గోల్డెన్ ఇంటర్న్‌షిప్ అని చెపుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పనిచేసిన అనుభవాన్ని పొందగలరు. కాబట్టి అర్హులైన విద్యార్థులందరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ 2022 అర్హత: అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వ్యవసాయం, పర్యావరణం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, సహజ వనరుల నిర్వహణ, ప్రైవేట్ రంగ అభివృద్ధి మరియు ఇతర సంబంధిత రంగాలకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
Also Read: పశువైద్య శాస్త్ర రంగాలకు రూ.80,000 స్కాలర్‌షిప్
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022 స్టైపెండ్:
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌లందరికీ ఒక గంట జీతం చెల్లిస్తుంది మరియు రూ.2,26,420 వరకు ప్రయాణ ఖర్చులను అందిస్తుంది. అయితే విద్యార్థులు స్వంత వసతిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంటర్న్ స్థానాలు వాషింగ్టన్ DCలో ఉన్నాయి, మరికొన్ని ప్రపంచ బ్యాంక్ కంట్రీ ఆఫీసులలో ఉన్నాయి.
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022 వ్యవధి: కనీసం 4 వారాలు
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022కు ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు తప్పనిసరిగా కనిపించే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి. సిస్టమ్ గడువు ముగియడాన్ని నివారించడానికి దయచేసి 90 నిమిషాలలోపు ఒకే సిట్టింగ్‌లో అప్లికేషన్‌ను పూర్తి చేయాలి.
ఈ పత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి:
రెజ్యూమ్ మరియు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్. అయితే ప్రతి ఫైల్ 5 MB కంటే తక్కువ పరిమాణంలో ఉండాలి. ఇక :.doc,.docx, or.pdf ఈ ఫార్మాట్‌లలో ఒకదానిలో ఉండాలి.
ఇక దరఖాస్తును సమర్పించిన తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం ఉండదు. అందుకే అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని అప్లోడ్ చెయ్యాలి. అనంతరం దరఖాస్తును సమర్పించిన తర్వాత అప్లికేషన్ నంబర్‌తో ఈమెయిల్ నిర్ధారణ జరుగుతుంది.
చివరిగా రిక్రూటింగ్ మేనేజర్లు షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను సంప్రదిస్తారు.
Also Read: మిజోరాం రైతు కుమార్తెకు రూ. 2.8 కోట్ల విలువైన సింజెంటా స్కాలర్‌షిప్