Farmer Kempegowda: కష్టపడటమే కానీ ఎవరినీ ఒక మాట అనని రైతుకు అవమానం జరిగితే ఎలా ఉంటుందో రుచి చూపించాడు కర్ణాటక రైతు. ఇటీవల కర్ణాటకలో బొలెరో పికప్ వాహనాన్ని కొనుగోలుచేయడానికి మహీంద్రా కార్ల షోరూమ్‌కి వచ్చిన రైతును అక్కడ సిబ్బంది అవమానించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు ఆకారాన్ని, వస్త్రధారణని చూసి హేళన చేసిన సదరు మహేంద్ర సంస్థ ఇప్పుడు తలదించుకుంది . తమ తప్పు తెలుసుకుని ఆ రైతుకు క్షమాపణలు కోరింది. కాగా రైతు కోరినట్టుగానే తమ సంస్థ వాహనాన్ని డెలివరీ చేసింది. దీంతో యావత్ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో రైతు గురించి చర్చ జరుగుతుంది.
కర్నాటకలోని తుమకూరు ఏరియాకు చెందిన కెంపెగౌడ అనే ఓ సాధారణ రైతు బొలెరో పికప్ ట్రక్ కొనాలనుకున్నాడు. ఈ మేరకు అయన ఈ నెల 21న తుముకూరులోని మహేంద్ర షోరూమ్ కు వెళ్ళాడు. అయితే ఆ రైతు, స్నేహితుల వేషధారణ చూసి షోరూమ్ సిబ్బంది హేళన చేస్తూ అవమానించారు. మీ జేబులో కనీసం 10 రూపాయలు అయినా ఉన్నాయా? మీరు అనుకున్నట్టు కారు 10 రూపాయలు కాదంటూ సిబ్బంది తమ వక్రబుద్ధితో రైతును అవమానకరంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆత్మాభిమానం దెబ్బతిన్న కెంపెగౌడ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి గంటలో 10 లక్షల రూపాయలతో తిరిగొచ్చి కారు వెంటనే డెలివరీ ఇవ్వాలనడంతో షోరూం సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read: మహేంద్రా షోరూమ్‌లో రైతుకు అవమానం – దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు
అయితే వాహనం వెంటనే డెలివరీ ఇవ్వలేమని, మూడు రోజులు పడుతుందంటూ రైతుతో అనగా.. తనకు వెంటనే కారు డెలివరీ ఇవ్వాలని కోరాడు. తనతో దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. చివరికి పోలీసులు కల్పించుకుని సేల్స్ మాన్ తో క్షమాపణలు చెప్పించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే ఇదంతా ఒక్క ఎత్తయితే వాహనం ఆ రైతు ఇంటికి చేర్చింది మహేంద్ర షోరూమ్ సంస్థ.
ఈ సందర్భంగా షోరూం సిబ్బంది రైతు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదని, వాహనాన్ని సమయానికి తెచ్చి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని కెంపెగౌడ తెలిపారు.
Also Read: రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని నిరూపించాడు