Anand Mahindra: దేశానికి వెన్నుముక ఒక రైతు. కానీ అన్నదాతలంటే కొందరికి చిన్నచూపు. కొందరు రైతుల పట్ల సంకుచితభావం ప్రదర్శించి, గడ్డిపూచలా తీసిపడేస్తారు. ఇక ఒక రైతుకు కారు కొనే అర్హతే లేనట్టుగా వ్యవహరించిన ప్రముఖ కార్ల షోరూమ్ మహీంద్రా సంస్థ ఇప్పుడు ఆ రైతు కోసం పరితపిస్తుంది. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కోరుతుంది.
తాజాగా కర్నాటకలోనిన తుముకూరులో చోటు చేసుకున్న వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. దానికి కారణం మహేంద్ర కంపెనీ యజమాని ఆనంద్ మహీంద్రా ఆ రైతును కోరిక కోరడం. రైతును అవమానించిన ఘటనతో మహీంద్రా గ్రూపుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే మహీంద్రా రైస్ గ్రూపుతో పాటు ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇది మా పాలసీ కాదంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఐపన్పటికీ ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూనే ఉంది. ఇక మహీంద్రా సంస్థపై ట్రోల్స్ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో మహీంద్రా వాహనం కొనాలంటూ కెంపెగౌడని కోరుతూ ట్వీట్ చేసింది ఆ సంస్థ. అయితే దాన్ని రీట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కెంపెగౌడకి వెల్కమ్ చెప్పారు.
ఇంతకీ ఆ రైతు కథేంటి అంటే.. కెంపెగౌడ ఓ సాధారణ రైతు. తన వ్యవసాయ అవసరాల నిమిత్తం బొలేరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని తుముకూరులో ఉన్న మహేంద్ర కార్ల షోరూమ్ కు వెళ్ళాడు. అయితే కెంపెగౌడ మిత్రబృందాన్ని చూసిన షోరూమ్ సేల్స్ మన్ ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. వాహనం కొందామని వచ్చామని కెంపెగౌడ బదులిచ్చాడు. దాంతో ఆ సేల్స్ మన్ కారు ధర రూ.10 కాదంటూ హేళన చేశాడు. ఆ మాటలతో కెంపె గౌడ ఆగ్రహానికి లోనయ్యాడు. కాసేపట్లోనే రూ.10 లక్షలు తీసుకువచ్చి వెంటనే బొలేరో పికప్ ట్రక్ ను తనకు అప్పగించాలని కోరాడు. అది సాధ్యం కాలేదు ఆ సంస్థకి. దీంతో షోరూమ్ యాజమాన్యం ఆ రైతుకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు.
ఇక ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. కార్ షోరూమ్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేశభాషలని బట్టి మనిషిని అంచనా వేస్తే ఇలానే ఉంటది అంటూ ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సమయంలో మహేంద్ర సంస్థ నుంచి కెంపెగౌడకు పిలుపు వచ్చింది.