జాతీయం

Jamun Cultivation: జామున్ పండించే మహారాష్ట్ర రైతులకు శుభవార్త

0
Jamun Cultivation

Jamun Cultivation: జామున్ భారతదేశంలోని దేశీయ పండ్లలో ఒకటి. అంతేకాదు ఈ జాతి పండ్లలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఇది ఒక వరమనే చెప్పాలి. భారతదేశంలో చాలా జామున్ చెట్లు ఉష్ణమండల & ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇది ఇండో-గంగా మైదానాలలో విస్తృతంగా పెరుగుతుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ తాలూకాలో జామున్ ను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు అక్కడి రైతులు. ఇక్కడి వాతావరణం జామున్ సాగుకు చాలా మంచిదని భావిస్తారు, అయితే జామున్ ను సాగు చేయడం అంత తేలికైన పని కాదంటున్నారు రైతులు. సాగుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. దీని పండ్లను తీయడానికి ఉపయోగించే పనిముట్ల ధర ఎక్కువగా ఉండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Jamun Cultivation

Jamun Cultivation

ఇదిలా ఉండగా జామున్ పండించే రైతులకు శుభవార్త అందించింది మహారాష్ట్ర గవర్నమెంట్, జాము పండించే రైతులకు పండు తీయడానికి ఉపయోగించే యంత్రాలపై ప్రభుత్వం సబ్సిడీని అందజేస్తోంది. ఆ యంత్రం పేరును పరంచి గా పిలుస్తున్నారు. దీన్ని వెదురుతో తయారు చేస్తారు. అయితే రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌ ద్వారా పరంచికి సుమారు 10 లక్షల రూపాయల రాయితీ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.

Paranchi

Paranchi

Also Read: రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని నిరూపించాడు

పరంచి అంటే ఏమిటి?
జామున్ చెట్టు చాలా పొడవుగా ఉంటుంది. దాని కొమ్మలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఈ కారణంగా చెట్టు యొక్క పండ్లను విచ్ఛిన్నం చేయడం అంత సులభం కాదు. కాబట్టి చెట్టు నుండి పండ్లను తీయడానికి వెదురును ఉపయోగిస్తారు. పరంచి పనిముట్లు వెదురుతో తయారు చేస్తారు. ఒక చిన్న చెట్టుకు కనీసం 70 వెదురులు కావాలి (పెద్దవి అయితే 100), ఇది కాకుండా వెదురును ఒకదానితో ఒకటి కట్టడానికి తాళ్లు అవసరం కాబట్టి దాని తయారీకి రైతుకు కనీసం రూ. 20,000 ఖర్చు అవుతుంది. పరంచికి అధిక ధర ఉండడంతో ప్రభుత్వం నుంచి రాయితీ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Jamun Fruits

Jamun Fruits

జామున్ చెట్లు మార్చి నెలలో ఫలాలను ఇస్తాయి. ఒక్క బహ్డోలి గ్రామంలోనే 6000 నాణ్యమైన జామున్ చెట్లు నాటారు. ఈ సంఖ్య మరింత పెరుగుతోందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడి వాతావరణం జామూన్‌కు అనుకూలమైనది.

Also Read: మిజోరాం రైతు కుమార్తెకు రూ. 2.8 కోట్ల విలువైన సింజెంటా స్కాలర్‌షిప్

Leave Your Comments

Healthy Cooking Oil: వంటల్లో ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది

Previous article

Mizoram Hmangaihzuali: మిజోరాం రైతు కుమార్తెకు రూ. 2.8 కోట్ల విలువైన సింజెంటా స్కాలర్‌షిప్

Next article

You may also like