Makhana Cultivation: వ్యవసాయం వాణిజ్యపరంగా బూస్ట్ అవుతుంది. ఒకప్పుడు వ్యవసాయాన్ని కేవలం ఆహారపదార్ధాలుగా మాత్రమే చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో వ్యవసాయం ఆర్ధికంగా ఆదుకుంటుంది. సరైన నిర్ణయం తీసుకుని సాగు చేసినట్లయితే లక్షల్లో ఆదాయం పొందవచ్చు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగంతో బాధపడుతున్నట్టు నివేదికలో తేలింది. ఇక ఉద్యోగం చేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలతో సంతోషంగా లేరన్నది స్పష్టం. ఈ క్రమంలో నిర్దిష్ట వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే వ్యవసాయం రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి.
మఖానా సాగు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు రైతులు. . మార్కెట్‌లో మఖానాకు చాలా డిమాండ్ ఉంది. ఇది ప్రతి సీజన్‌లో వినియోగిస్తారు. నగరం, గ్రామంలో ప్రతి చోటా దీన్ని వాడుతారు. ముఖ్యంగా బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో మఖానా సాగు ఎక్కువగా జరుగుతుంది. మీరు బీహార్‌లో నివసించి సాగు చేస్తే మీకు ప్రభుత్వం నుండి సబ్సిడీ కూడా లభిస్తుంది.
హెక్టారు భూమిలో మఖానా సాగు చేస్తే సగటున 97 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మరోవైపు మీరు బీహార్ వాసి అయితే మీరు ఈ వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వం నుండి సబ్సిడీని కూడా పొందుతారు. మఖానా సాగుకు విత్తనాలు కొనుగోలు చేయాలనే ఆందోళన కూడా ఉండదు. మీరు మునుపటి పంట నుండి విత్తనాలను సులభంగా పొందవచ్చు. ఈ వ్యవసాయంలో మీ డబ్బులో ఎక్కువ భాగం కూలీకి ఖర్చు అవుతుంది. ఈ పంటను పండించడంలో శ్రమ మరియు సంరక్షణ రెండూ అవసరం.
Also Read: అపరాల సాగు
పంట సిద్ధమైన తర్వాత మార్కెట్‌లో విక్రయించడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. మఖానాతో పాటు దాని కాండాలు మరియు దుంపలకు కూడా స్థానిక మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మీరు అమ్మడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. మఖానా సాగు ద్వారా ఏడాదిలో 3 నుంచి 4 లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు.
ముఖానా ఆరోగ్యానికి ఔషధంలా పని చేస్తుంది:
వీటిలో కేలరీలు చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి కిడ్నీలకు, గుండెకు చాలా మంచిది. శారీరక బలహీనతలు తొలగించి కొద్ది రోజుల్లోనే శరీరానికి బలాన్ని సమకూరుస్తుంది. క్యాల్షియమ్ లోనూ తక్కువేం కాదు. ప్రతి 100గ్రాముల మఖానాలో 350కేలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా 9.7శాతం ప్రొటీన్లు, 76శాతం కార్బొహైడ్రేట్లు, 12.8శాతం తేమ, 0.1 శాతం ఆరోగ్యకరమైన కొవ్వు, 0.5శాతం సోడియం, 0.9శాతం పాస్పరస్, 1.4మిల్లీ గ్రాముల ఐరన్, కాల్షియం, యాసిడ్, విటమిన్-Vలు పెద్ద మొత్తంలో దొరుకుతాయి.
Also Read: ఆముదం సాగు యాజమాన్య పద్దతులు