Pakisthani Palm Farmers: ఖర్జూరం ఇరాక్ దేశానికి చెందిన పంట. కానీ అరబ్ వర్తకుల రాకతో ఈ ఖర్జూరం పాకిస్థాన్ కు చేరింది. పాకిస్థాన్ లోని ఖైర్పూర్లో ఖర్జూరం అత్యధికంగా పండుతుంది. ఆ ప్రాంతం సముద్రానికి దూరంగా ఉండటం, తేమ లేకపోవడం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఖర్జూరం పంట పండించేందుకు ఆ ప్రాంత వాతావరణం అనువుగా ఉంటుంది.
ఖర్జూరం ఫిబ్రవరి నెలలో మొదలై జూన్ నాటికి చేతికొస్తుంది. అయితే ఆ పంటను ఖర్జూరం పండ్లలా చేయాలా, ఎండు ఖర్జూరం చెయ్యాలా అన్నది రైతు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాగా మార్కెట్లో ఖర్జూరానికి ఉన్న ధరను బట్టి రైతు దాన్ని నిర్ణయిస్తాడు. అయితే ప్రస్తుతం పాక్-భారత్ మధ్య నెలకొన్న సంబంధాలతో ఈ ప్రక్రియలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: ఖర్జూరం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
పాకిస్థాన్లోని ఖైర్పూర్ కు చెందిన అభ్యుదయ రైతు గులాం ఖాసీం జస్కాని భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త సంబంధాలు చిన్న రైతుల ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చుపించాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎండు ఖర్జూరం ధర కిందకు పడిపోయిందన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 15 శాతం సాఫ్ట్ డేట్స్ ఖర్జూరాలనే చేస్తున్నాం. మిగిలిన 85 శాతం ఎండు ఖర్జూరంగా చేస్తున్నాం. వాటిని ఖైర్పూర్లో ఛుహార అని అంటారు. కాగా మా వద్ద నుండి 95 శాతం ఖర్జూరాలను భారతదేశానికి ఎగుమతి చేసేవాళ్ళం. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల భారత్ కు ఎగుమతి చేస్తుండకపోవడంతో రైతులు సాఫ్ట్ డేట్స్ వైపు వెళ్తున్నారు. గతంలో 15 శాతం ఉండే సాఫ్ట్ డేట్స్ ఉత్పత్తులు ప్రస్తుతం 25 శాతం వరకు పెరిగింది.
2019లో బాలకోట్ దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో ఇరుదేశాలు పరస్పర సంబంధాలు తెంచుకుని వాణిజ్యాన్ని ఆపేసాయి. పాకిస్థాన్ 55 లక్షల టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందని పాకిస్థాన్ మంత్రిత్వశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఇక పాకిస్థాన్ లో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులపై భారత్ 200 శాతం పన్ను విదిస్తుంది. అయితే ఆ పన్ను ఎండు ఖర్జూరానికి కూడా వర్తిస్తుంది. ఇలా పాక్ పై ఖర్జూర పంటకు పన్ను విధించడం ద్వారా దీని ధర భారత్ లో విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ రైతులు ఇరుదేశాల్లో ఉన్న వర్తకులు కూడా నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు థర్డ్ పార్టీలుగా వ్యవహరిస్తున్న దేశాలు లాభాలు పొందుతున్నాయి.
Also Read: పంటలు సాగు చేయడంలో సరికొత్త వైవిధ్యాన్ని చాటుతున్న రైతులు..