TS Minister Niranjan Reddy: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. మొదటి వేవ్ లో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా, సెకండ్ వేవ్ లో ఉగ్రరూపం దాల్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వాక్సినేషన్ తీసుకున్న వారికి సైతం కరోనా మహమ్మారి సోకుతున్న తీరు దేశానికి ఆందోళనకరంగా మారింది. ఇక సామాన్యులే కాకుండా సినిమా, స్పోర్ట్స్, రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
Also Read: రైతులు అధైర్యపడొద్దు -మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ రోజు జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రిగారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నిన్న, మొన్న, ఈ రోజు వారిని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఓమిక్రాన్ గా తన వేరియంట్ మార్చుకున్న కరోనా విషయంలో ప్రజలెవ్వరూ తేలికగా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి మరణాల సంఖ్య లేనప్పటికీ భవిష్యత్తులో దీని ప్రభావం మారవచ్చని భావిస్తున్నారు. ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా అరికట్టే విషయంలో భాగస్వాములవ్వాలని కోరుతున్నారు.
Also Read: ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో సమరానికి సిద్ధం: మంత్రి నిరంజన్ రెడ్డి