Organic Fertilizers Benefits: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఉత్పాదకత, రైతులను, శాస్త్రవేత్తలను, పర్యావరణ వేత్తలను నేడు తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఆహార అవసరాలను తీర్చటానికి అభ్యమయ్యే వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పరిమిత వనరులతో అధిక ఉత్పాదకత సాధించ గలగాలి. ఈ కోణంలో చూస్తే వ్యవసాయ భూముల యాజమాన్యంలో సేంద్రీయ ఎరువులు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం అధికమైన దరిమిలా రైతులు సాంప్రదాయకంగా వాడిన సేంద్రీయ ఎరువులను విస్మరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిరోధించలేక పోయినా తగ్గించటానికి ప్రయత్నం చేయాలి. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల రసాయనిక ఎరువులకయ్యే ఖర్చు తగ్గటమే కాకుండా భూసారం పెరిగి, భూ భౌతిక స్థితిగతులు మెరుగుపడి మొక్కలు ఏపుగా పెరిగి, పంటల దిగుబడులు పెరుగుటతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుటకు, వాతావరణ కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతుంది
లాభాలు:
- మొక్కకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, జింకు, రాగి మొదలగు మూలకాలను సరఫరా చేస్తుంది.
- నేల భౌతిక స్థితి గతులను మెరుగు పరుస్తుంది. అంటే నీరు నిల్వ ఉంచే శక్తి, నేలలో గాలి ప్రసరణ, మట్టి రేణువులు ఒక దాని కొకటి పట్టి ఉంచే శక్తి మెరుగుపడతాయి.
- భూసారం, నేల ఉత్పాదక శక్తి మెరుగవుతాయి.
Also Read: సేంద్రీయ వ్యవసాయంలో బయోచార్ పాత్ర
- సేంద్రీయ ఎరువుల వాడకం వలన భూమిలో సూక్ష్మ పోషక పదార్థాల నిష్పత్తి మారుతుంది. దీనివలన భూమిలోని మొక్కలకు హాని కలిగించే నులి పురుగులు శిలీంద్రాలు కొంత వరకు అదుపులో ఉంటాయి.
- రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది.
- సేంద్రీయ ఎరువుల నుంచి నత్రజని మెల్లగా విడుదల అవడం వలన నత్రజని నష్టం తక్కువగా ఉంటుంది.
- నేలలోని సూక్ష్మజీవులకు మంచి ఆహారం గాను, అవి అభివృద్ధిచెంది చురుకుగ పని చేయడానికి ఉపయోగ పడుతుంది.
- పండ్లు, కూరగాయలు, ఇతర పంటలలో నాణ్యత పెరుగుతుంది.
- ఉప్పునేలలు, చౌడునేలలో లవణ, క్షార గుణాలు తగ్గించి పంటల దిగుబడులను పెంచడంలో దోహద పడుతుంది.
- బరువు నేలలు గుల్లబారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయ పడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగు సౌకర్యం మెరుగవుతుంది.
- నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచే శక్తి పెరగడానికి దోహద పడుతుంది. బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
- భూమిలోని వ్యాధికారక సూక్ష్మ జీవులను నశింపచేసి మొక్కలకు రక్షణ కల్పిస్తాయి.
- మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుంది.
Also Read: సేంద్రీయ ఎరువుల తయారు విధానం.. ప్రయోజనాలు !