AgroStar Farmers Insurance: రైతులు ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం చెందినా అలాంటి రైతులకోసం ఆర్ధిక రక్షణ అందించేందుకు ఆగ్రోస్టార్ కిందా ‘కిసాన్ రక్షా కవచ్’ వ్యక్తిగత ప్రమాద బీమా ప్రారంభించింది. నిబంధనల ప్రకారం ఆగ్రోస్టార్ యాప్ ద్వారా అగ్రి ఇన్‌పుట్‌లను కొనుగోలు చేసే రైతుకు 2 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఉచితంగా లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా ఇందుకు గానూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు గ్రామ్ కవర్ గ్రూప్ ఇన్సూరెన్స్ తోడ్పాటు అందించనున్నాయి. దేశంలోని 50 లక్షల కంటే ఎక్కువ మంది రైతులు వ్యవసాయ సలహాలు మరియు అధిక-నాణ్యత, ప్రత్యేకమైన వ్యవసాయ ఉత్పత్తులకు ఆగ్రోస్టార్‌పై ఆధారపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆ సంస్థ రైతులతో అనేక పరస్పర చర్చల తర్వాత ఈ ఇన్సూరెన్స్ పాలసీ ప్రవేశపెట్టింది.
ఆగ్రోస్టార్ యాప్‌ని ఉపయోగిస్తున్న పలువురు రైతులు ఈ పాలసీ ప్రయోజనాలను పొందడం ప్రారంభించారు, ఇది రైతులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రారంభించిన నెల రోజుల్లోనే పది వేల మంది రైతులకు చేరువైంది.
Also Read: ఎస్సీ మహిళా రైతులకు ఏపీ ప్రభుత్వం మద్దతు
ఆగ్రోస్టార్ ఇన్సూరెన్స్ పాలసీ విధానంపై సంస్థ స్పందిస్తూ.. మా రైతులకు వ్యక్తిగత భద్రతను అందించడానికి ఆగ్రోస్టార్ యాప్‌లో కిసాన్ రక్షా కవచ్ కార్యక్రమం చేపట్టామని చెప్పింది. ఈ పాలసీ ద్వారా రైతులకు మేలు జరగనుంది. మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తుంది అని ఆగ్రోస్టార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శార్దూల్ షేత్ అన్నారు. అదేవిధంగా ఈ విధానం ద్వారా మా రైతుల జీవితాలను మెరుగుపరుస్తుందని మరియు వారితో మా నమ్మకాన్ని మరియు సంబంధాన్ని బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము అని అన్నారు.
కాగా ఆగ్రోస్టార్ యాప్‌లో ప్రవేశపెట్టిన ఎంబెడెడ్ బీమా కార్యక్రమం ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే ప్రమాదవశాత్తూ మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు అది విలువ ఆధారిత సేవ (VAS) ప్రతిపాదనగా రైతుకు స్థిర ప్రయోజనాన్ని అందిస్తుంది అని గ్రామ్‌కవర్ సహ వ్యవస్థాపకుడు & గ్రూప్ CEO ధ్యానేష్ భట్ అన్నారు.
Also Read: వేలాది ఎకరాల్లో పంట నష్టం…మిర్చి రైతులను నిండా ముంచిన తామర పురుగు