Telangana Groundwater: తెలంగాణలో పెద్దయెత్తున జరుగుతున్న నీటి పారుదల రంగ అభివృద్ది వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. తెలంగాణాలో దాదాపుగా 50 శాతం మండలాల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. అయితే 29 మండలాల్లో మాత్రం నీటి లభ్యత తక్కువగా ఉంది. తాజాగా భూగర్భ జలాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు గ్రౌండ్ వాటర్ పై సంబంధిత శాఖ అధ్యయనం చేసింది.
హైదరాబాద్ లోని జలసౌధ నివేదిక ప్రకారం చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా 4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని తెలిపింది. ఒక్కో మీటర్ వంద టీఎంసీలతో సమానం. గతంలో కంటే భూగర్భజలాలు పెరగడంతో నీటిలో లవణాల శాతం తగ్గింది. అయినా కొన్ని జిల్లాల్లో ఇంకా నైట్రోజన్, ఫ్లోరైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read: వాన నీటి సంరక్షణలో కందకాల ప్రాముఖ్యత.!
నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో భూగర్భజలాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో నైట్రోజన్, ఫ్లోరైడ్ శాతం తగ్గుతుందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే భూగర్భ జలాలు పెరగడంతో వరి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయోగమేనన్నారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో వరి పంట సాగు చేస్తున్నారు. వరి ప్రత్యామ్నాయ పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సమయంలో భూగర్భజలాలు పెరగడం రైతులకు ఊరటనివ్వనుంది.
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో పెద్దయెత్తున చేపట్టిన హరితహారం కూడా భూగర్భజలాలు పెరగడానికి దోహదపడిందని అంటున్నారు నిపుణులు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రుతుపవనాల కొరత లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ద్రుష్టి సారించడం లాంటి పరిణామాలు తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకుళ్తుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: చౌడు నేలలకు పరిష్కారం.. !