Sugarcane Varieties: ఆంధ్రప్రదేశ్‌లో చెఱకు పంటను షుమారు 6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి.
రకాలు:
ఆలస్యంగా పక్వానికి వచ్చే రకాలు (12 -13 నెలలు): Co 7219, Co7706, Co8011, CoR8001.
మధ్య–ఆలస్య పరిపక్వ రకాలు (11-12 నెలలు) : CoA7602, CoT8201, Co7805, Co8021, 85R186, 86A146, 87A 397, 83V15, 83V288.
ప్రారంభ పరిపక్వ రకాలు (9 -10 నెలలు) : Co6907, Co7505, 90A 272, 81A99, 82A123, 83A145,
81V48, 85A261, 86V96, 84A125, 91V83, 93V297, 83R23, 87A298.
Also Read: చెఱకులో సూక్ష్మధాతు లోపాలు మరియు యజమాన్యం
ఫిబ్రవరిలో నాటడానికి వర్షాధార పరిస్థితుల్లో: Co6907, 81A99, 85A261, 81V48, 83R23, CoT820, CoA7602, 87A298, Co7210.
మే – జూన్లో నాటడానికి: Co6907, Co8013, 84A125, 85A261, 81A99, 87A298, 81V48, 91V83, 93V297.
నీరు చేరిన (చిత్తడి) పరిస్థితుల కోసం: Co697, 84A125, CoR8001, 83V288, 83V15, 81V48,
91V83, 87A298, 85A261, 87A261, 87A397, 89V74.
తేమ ఒత్తిడి పరిస్థితుల కోసం: Co6907, CoT8201, CoA7602, Co7219, 84A125, 85A261, 83V15, 81A99, 83R23, 89V74, 83V288, Co7508.
డ్రాట్ ప్రభావిత ప్రాంతాల కోసం: Co7508, CoA7602, Co8014, CoR8001, 85A261, 87A298, 90A272, Co6907, 86V96, 83R23, 91V83, 88R58, 92A2718, Co.97735, Co.
స్మట్ వ్యాధిని తట్టుకునే రకాలు: Co8013, Co8014, 81A261, 84A125, 81A48, 83V15, 83V288, 83V96, 89V74, 93V297, 90A272, C07805, 39.69
బెల్లం తయారీకి: Co7706
సెలైన్ / ఆల్కలీన్ నేలల కోసం : 81V48, 81A99, CoT8201, 93A145
Also Read: చెఱకు నుండి బెల్లం తయారీలో మెళకువలు