మన వ్యవసాయం

Gherkins: చిన్నదోస ఎగుమతిలో భారత్ అగ్రస్థానం

2
Gherkins

Gherkins: సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతుల్లో కొందరు పంట మార్పిడికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రైతులు ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా గెర్కిన్స్ సాగుతో ఆర్ధిక పరిపుష్టిని సాధిస్తున్నారు. ప్రస్తుతం చిన్న దోసకాయ ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

Gherkins Farming

Gherkins Farming

చిన్నదోసకాయల ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. తాజా నివేదికల ప్రకారం ఏప్రిల్ నుండి అక్టోబర్ (2020-21) మధ్య కాలంలో 1,23,846 మెట్రిక్ టన్నుల దోసకాయ మరియు గెర్కిన్‌లను ఎగుమతి చేసింది. కాగా వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) అంతర్జాతీయ మార్కెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పత్తుల ప్రమోషన్ మరియు ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థకు కట్టుబడి ఉండేలా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది.

అయితే ఈ గెర్కిన్‌లు రెండు కేటగిరీల కిందా ఎగుమతి చేయబడతాయి. అంటే దోసకాయలు మరియు గెర్కిన్‌లు వెనిగర్ లేదా ఎసిటిక్ యాసిడ్ లతో తయారు చేసి భద్రపరుస్తారు. ఇవి తాత్కాలికంగా నిల్వ ఉంటాయి. అయితే ఈ తరహా దోసకాయలను సేంద్రీయంగా ఇంట్లో సాగు చేయడం ద్వారా దేశంలోని రైతులు భారీ లాభాలను ఆర్జిస్తున్నారని తాజా లెక్కలు చెప్తున్నాయి.

Gherkins Cultivation

Gherkins Cultivation

గెర్కిన్ సాగు:

గెర్కిన్ సాగు మరియు ఎగుమతులు1990లో కర్ణాటకలో ప్రారంభమైంది. తరువాత పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు విస్తరించాయి. ప్రపంచంలోని గెర్కిన్‌లో దాదాపు 15% ఉత్పత్తి భారతదేశంలోనే సాగు చేయబడుతుంది. ప్రస్తుతం, గెర్కిన్స్ 20 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాలు మరియు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్, దక్షిణ కొరియా, కెనడా, రష్యా, చైనా, శ్రీలంక, జపాన్, బెల్జియం వంటి ఓషియానిక్ దేశాలు. మరియు ఇజ్రాయెల్ లకు ఎగుమతి జరుగుతుంది. ఎగుమతి సామర్థ్యంతో పాటు, గ్రామీణ ఉపాధి కల్పనలో గెర్కిన్ పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో 65,000 ఎకరాల వార్షిక ఉత్పత్తి విస్తీర్ణంతో సుమారు 90,000 మంది చిన్న ,సన్నకారు రైతులు ఒప్పంద వ్యవసాయం కింద గెర్కిన్‌ల సాగు చేస్తున్నారు.

Also Read: కీరదోస పంట సాగుతో లక్షల్లో లాభాలను పొందుతున్న యూపీ రైతు..

Gherkins

Gherkins

ప్రాసెస్ చేయబడిన గెర్కిన్లు పారిశ్రామిక ముడి పదార్థంగా మరియు తినడానికి సిద్ధంగా ఉన్న పాత్రలలో పెద్దమొత్తంలో రవాణా చేయబడతాయి. భారతదేశంలో డ్రమ్స్ మరియు రెడీ-టు-ఈట్ కన్స్యూమర్ ప్యాక్‌లలో గెర్కిన్‌లను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్న దాదాపు 51 ప్రధాన కంపెనీలు ఉన్నాయి.

APEDA పాత్ర ఎంత:
ప్రాసెస్ చేయబడిన కూరగాయల ఎగుమతిని ప్రోత్సహించడంలో APEDA ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది మరియు ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరియు ప్రాసెస్ చేసిన గెర్కిన్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరియు ప్రాసెసింగ్ యూనిట్లలో ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థల అమలుకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

Gherkins Plantation

Gherkins Plantation

గెర్కిన్ రైతులు సంపాదన:
సగటున గెర్కిన్ ను సాగు చేసే రైతు ఎకరానికి 4 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తాడు. రూ.40,000 నికర ఆదాయంతో సుమారు రూ.80,000 సంపాదిస్తాడు. గెర్కిన్ పంట కాలం 90 రోజులు కాగా..రైతులు ఏటా రెండు పంటలను పండిస్తున్నారు.

Also Read: వేసవిలో దోస సాగు..మెళుకువలు

Leave Your Comments

PJTSAU Agribiotech Foundation: పిజెటీఎస్ఏ అగ్రిబయోటెక్ ఫౌండేషన్ ల మధ్య ఒప్పందం

Previous article

Spice Seeds: సుగంధ పంట విత్తనాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ICAR

Next article

You may also like