Coconut: కొబ్బరి మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతభాండము. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పన్నాలు, కొబ్బరి నీరు ఆధారంగా ఉత్పన్నాలు, కొబ్బరి టెంక మరియు కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు ప్రధానమైనవి. కొబ్బరి చెట్టు ఆధారంతో చేతితో తయారుచేసిన అలంకార వస్తువులు ముందంజలో ఉన్నాయి. మన దేశంలో కొబ్బరి పంట విస్తీర్ణంలో మన రాష్ట్రం నాల్గవ స్థానంలో, ఉత్పత్తిలో మూడవ స్థానంలోను, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో సగానికి పైగా కొబ్బరి విస్తీర్ణం ఉభయగోదావరి జిల్లాలకి పరిమితమైనది. కొబ్బరి నుండి పలురకాల ఉత్పత్తులను తయారుచేసి, ఎన్నో గృహా పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో చాలా అవకాశాలు, వనరులు ఉన్నాయి.
కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు:
లేత కొబ్బరి బొండాం : కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరము. ప్రతి నిత్యము కొబ్బరి. నీరు సేవించిన అమృతముతో సమానము. రోజూ ఒక కొబ్బరి బొండాం త్రాగుటవలన ఆరోగ్యానికి చేరువగా, వైద్యునికి దూరముగా ఉండవచ్చును. ఇదే విధముగా కొబ్బరి బొండాం నీటితో పళ్ళ రసాలు, లస్సీ మరియు కొబ్బరి షేక్ లను తయారుచేసుకొనవచ్చును. వివరములు కోనసీమ కొబ్బరి వంటకాలు పుస్తకములో తెల -పడమైనది.
ముదురు కొబ్బరి నీళ్ళతో ఉత్పన్నాలు : కొబ్బరి నీళ్ళు, కొబ్బరి వెనిగర్, నాటా-డీ-కోకో, కొబ్బరి తేనె, కొబ్బరి సాస్, కొబ్బరి లెమనేడ్.
ముదురు కొబ్బరిని నిలువ ఉంచుకొనుటకు కొబ్బరిని పగులగొట్టిన తరువాత ఆ లోపలి భాగములో వెనిగర్ రాసినచో బూజు పట్టకుండా 24 గంటలు ఉంటుంది. అలా వెనిగర్ ని రోజూ పట్టించిన ఎడల అవి నాలుగు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.
కొబ్బరి నీళ్ళతో నాటా-డి-కోకో తయారు చేయు విధానము : కొబ్బరి నీళ్ళలో పంచదార, గ్లాషియల్ యసిటిక్ యాసిడ్ కలపాలి. 10 నిమిషాలు వేడిచేసి చల్లార్చిన తరువాత, కొద్ది కొద్దిగా సమానంగా ప్లాస్టిక్ కప్స్ లో వేసి, పేపర్ కాని గుడ్డతోగాని దుమ్ముపోకుండా కట్టాలి. దీన్ని రెండు మూడు వారాలు కదపకుండా ఉంచాలి. తెల్లని జెల్లీ వంటి మందమైన పొర ఏర్పడిన తరువాత శుభ్రంగా నీటితో కడగాలి. దీన్ని మళ్ళీ వేడిచేసి గాజు సీసాలో వేసి స్టెరిలైజ్ చేయాలి.
Also Read: కొబ్బరి పీచుతో ఇంట్లోనే కూరగాయలు పండించండిలా!
కొబ్బరి బెల్లము
పచ్చి కొబ్బరి ఉత్పన్నాలు : కొబ్బరి వర్జిన్ నూనె, కొబ్బరి పాలు, కొబ్బరి తురుము, కొబ్బరి పాలపొడి, కొబ్బరి జామ్, కొబ్బరి సిరప్, కొబ్బరి తేనె, కొబ్బరి కాండీ.
ఎండు కొబ్బరి ఉత్పన్నాలు : కొబ్బరి బర్ఫీ, కొబ్బరి కుకీస్, కొబ్బరి చట్నీ పొడి, ఎండు కొబ్బరి, కొబ్బరి చిప్స్.
కొబ్బరి నూనె : కొబ్బరి నూనె నుండి తయారైన సబ్బులు మరియు ఔషదాలు, కొబ్బరి నూనెకేక్ (ఇది పశువులకు మంచి పౌష్ఠికరమైన ఆహారం)
కొబ్బరి చిప్పతో ఉత్పన్నాలు : కొబ్బరి చార్ కోల్ (బొగ్గు), కొబ్బరి చిప్పతో కప్స్ మరియు జార్స్, కొబ్బరి చిప్పతో యాక్టివేటెడ్ కార్బన్, కొబ్బరి చిప్పల పొడి, కొబ్బరి చిప్పలతో అలంకార వస్తువులు.
కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు : కొబ్బరి తాళ్ళు, కొబ్బరి పొట్టు, కొబ్బరి పీచుతో వస్త్రములు, కొబ్బరి పొట్టుతో వర్మికంపోస్ట్, కొబ్బరి పొట్టుతో సేంద్రీయ ఎరువు.
కొబ్బరి ఆకులతో ఉత్పన్నాలు : కొబ్బరి చాపలు, కొబ్బరి ఆకుల ఈనెలతో చీపుర్లు, అలంకార వస్తువులు, కొబ్బరి ఆకులు, కమ్మలు, డొలకలతో వర్మికంపోస్ట్.
కొబ్బరి కలపతో ఉత్పన్నాలు : తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ మరియు అలంకార వస్తువులు. కొబ్బరి చెట్టులో ప్రతీ భాగము ఉపయోగకరమైనది. నైపుణ్యం మరియు ఆలోచన శక్తితో ఎన్నో విధాలైన పదార్ధముల ను, వస్తువులను తయారుచేయవచ్చును. అందుకే కొబ్బరి కల్పవృక్షం.
Also Read: సమగ్ర యాజమాన్య పద్దతుల ద్వారా కొబ్బరిని ఆశించే కొమ్ము పురుగు – నివారణ