మన వ్యవసాయం

Chamomile: చామంతిలో సస్య రక్షణ – రైతు అనుభవాలు

0
Chamomile

Chamomile: శాంతికి చిహ్నమైన తెలుపు, శుభానికి సూచికైనా పసుపు వర్ణాలతో, అలంకారానికి అందం తీసుకొచ్చే పింక్ రంగుతో ఉన్న చామంతి పువ్వులను చూస్తే మనసు పులకరిస్తుంది. చామంతి పూల సాగు ఆశాజనకంగా ఉండటంతో రైతులు చామంతి పూల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడితో సిరులు కురిపిస్తుంది. చామంతికి చలి కాలంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చామంతి సాగులోనిలకడైన ఆదాయాన్ని సంవత్సరం పొడవునా ఆర్జిస్తున్నారు రైతులు. ఈ సాగును అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. మురుగు నీటి వసతి గల ఒండ్రు నేలలు ఈ పంటకు చక్కటి అనుకూలంగా చెప్పవచ్చు. అధిక వెలుతురు కలిగి ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నప్పుడు చామంతి మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి.

Chamomile

Chamomile

చామంతి సాగులో మెళుకువలు:

  • చామంతిలో డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే కలుపు బెడద తగ్గుతుంది.
  • మొక్క కింద భాగాన కదిలిస్తూ ఉంటే వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
  • నీరు నిల్వ ఉండకూడదు, మొక్క కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
  • ఒక ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల బసవరం, 60-80 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి.
  • 20 రోజులకొకసారి సుష్మధాతు మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. అలా చేయడం వల్ల మొక్క బలంగా తయారవుతుంది.
  • సుమారు 30 సెం.మీ. ఎత్తు పెరిగిన తర్వాత మొక్కల తలలు తుంచివేయాలి. ఈ విధంగా చేయటం వలన పక్కకొమ్మలు ఎక్కువగా వస్తాయి.
  • పువ్వు సైజ్ పెరగటానికి తలలు కత్తిరించిన 20-25 రోజులకు 50 పి.పి.యం. జిబ్బరెలిక్ ఆమ్లం 50 మీ.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.100 పి.పి.యం. నప్తలిన్ ఎసిటిక్ ఆమ్లం 100 మీ. గ్రా. లీటరు నీటికి కలిపి మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. 100-150 పి.పి.యం. జిబ్బరెలిక్ ఆమ్లం పిచికారీ చేస్తే 15-20 రోజులు ముందుగా పూలు కోతకువస్తాయి.
Chamomile Cultivation

Chamomile Cultivation

వాతావరణం మరియు నాటే సమయం:

చామంతి సాగుకు జూన్, జూలై మాసాల్లో నారు నాటితే నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో పూలు చేతికొస్తాయి.

నేలలు: ఈ సాగుకు తేలికపాటి నేలలు, ఎర్రనేలలు, ఇసుక నేలలు, ఒండ్రునేలలు అనుకూలం. మురుగునీటి సదుపాయం లేకపోతే మొక్కలు చనిపోతాయి.

  • సస్యరక్షణ: అందంగా కనిపించే చామంతి పువ్వుకు పచ్చపురుగు, ముడత, ఆకుతొలుచు పురుగులు ఆకర్షిస్తాయి. దీంతో పంట తీవ్రంగా దెబ్బతింటుంది.
  • పచ్చపురుగు: ఇది గొంగళి పురుగు జాతికి చెందినది. ఈ జాతి ఆకులు ఆకులను తినేస్తాయి. అదేవిధంగా పూలను కూడా పాడుచేస్తాయి. ఇవి ఆశించినప్పుడు మలాథిన్‌ 5 శాతం పొడి 8 కిలోలను చేలో చల్లుకోవాలి.
  • థ్రిప్స్‌: ఇవి రసం పీల్చే పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి ఆకుల పువ్వుల్లోని రసం పీల్చివేయడం వల్ల ఆకులు మడత పడి ఎండిపోతాయి. అలా జరగడం వల్ల పూలు వాడిపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకు డైమిథోయేట్‌ 1.5 మిల్లీలీటర్లు (లేదా) కార్బరిల్‌ 50 శాతం పొడిని 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Also Read: కృత్రిమ కాంతితో అన్ సీజన్ లో చామంతి పూల సాగు..

ఇక తెగుళ్ల విషయానికి వస్తే..

  • ఆకుమచ్చ: చామంతి పంటపై ఎక్కువగా ఆశించేది ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై నల్లని లోతైన గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు ఎండి ఒడిలిపోతాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్‌ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
  • వేరుకుళ్లు: ఈ తెగులు సోకిన మొక్కలు అకస్మాత్తుగా ఒడిలిపోతాయి. వేర్లు కుళ్లిపోతాయి. ఈ తెగులు సోకినప్పుడు మురుగునీరు నిల్వ లేకుండా చేసి, నివారణ చర్యలు చేపట్టాలి. బైటెక్స్‌ 3 గ్రాములు (లేదా) కాప్టాన్‌ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.

మొత్తంగా రైతులు మేలైన యాజమాన్యపద్దతులు పాటిస్తే ఎకరాకు 8 నుండి 10 టన్నుల వరకు పూల దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది.

Eleesha

Eleesha

చామంతి సాగులో తన అనుభవాలను పంచుకున్నారు బాపట్ల లేతపూడి గ్రామానికి చెందిన ఎలీషా.

నేను రాజమండ్రి రకం చామంతి సాగు చేశాను. నా గురువు భాషా గారి సూచనల మేరకు పురుగు, తెగుళ్ల మందులు వాడాను. పురుగు లావుగా రావడానికి కే శక్తి వినియోగించాను. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. అయితే భాషా గారి సూచనలు పాటించడం ద్వారా పంట కొంత మేర చేతికొచ్చింది అని చెప్పారు చామంతి సాగు రైతు ఎలీషా.

Bhasha

Bhasha

Also Read: చామంతి సాగు – యాజమాన్య పద్దతులు

Leave Your Comments

Farmer Success Story: యంగ్ పాడి రైతు ‘శ్రద్ధ‘ సక్సెస్ స్టోరీ

Previous article

Drip Irrigation: బిందు సేద్యం వలన కలిగే ప్రయోజనాలు

Next article

You may also like