వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 నుండి 14 వరకు వాతావరణం ఎలా ఉండబోతుంది ?

0

Andhra Pradesh Weather Report : వాతావరణ సమాచారం – పంటల సాగుకు సూచనలు

ఉభయ అనంతపురం జిల్లాలో మూడు రోజుల్లో(జూన్ 12 నుంచి 14 వరకు) తేలికపాటి వర్షపాత సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 29.8-35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22.2-24.7 డిగ్రీల సెల్సియస్ నమోదుకావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8.0 కి.మీ వేగంతో వీచే అవకాశముంది. గాలిలో తేమ ఉదయం పూట 68-88 శాతం, మధ్యాహ్నం పూట 60-74 శాతం నమోదయ్యే అవకాశం ఉంది.
సాధారణ సలహా:
వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు నైరుతి రుతుపవనాలు
ప్రవేశించిన ఒక వారంలోపు తేలికనేలల్లో 50-60 మి.మీ. వర్షపాతం, బరువైన నేలల్లో 60-75 మి.మీ వర్షపాతం నమోదయిన   తర్వాత మాత్రమే విత్తనం వేసుకోవాలి. తద్వారా పంట నష్ట పోకుండా సరైన సాంద్రతలో మొక్కలు ఉండేలా చూసుకోవడానికి వీలవుతుంది. నేలను వాలుకు అడ్డంగా దున్ని పంటలను విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది. వర్షాధారంగా సాగు చేసే పొలాల్లో అంతర పంటలు వేసుకోవాలి.

  • రైతులు సకాలంలో విత్తుటకు కావలసిన వర్షాధారపు పంటలైన వేరుశనగ, పత్తి, ఆముదం, కంది మొదలగు పంటల నాణ్యమైన విత్తనాలను, ఎరువులను సేకరించుకోవాలి.
    పంటల సాగులో ప్రత్యేక సలహాలు:
    వేరుశనగ:
    వేరుశనగ విత్తే రైతులు రుతుపవనాలు ప్రవేశించిన తరువాత, 60-75 మి.మీ
    వర్షం పడినట్లయితే వర్షధార పంటలను విత్తుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే విత్తుకోరాదు. అలాగే మరీ ఆలస్యంగా అంటే ఆగష్టు నెల
    ఆఖరి వరకు విత్తుకోరాదు.
  • విత్తే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్ యస్ 1 మి.లీ తో విత్తనశుద్ధి చేసిన తర్వాత టెబుకొనజోల్ 1.0 గ్రా లేదా మాంకోజెబ్ 3  గ్రా లేదా ట్రైకొడెర్మ విరిడి 10 గ్రా. చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
  • వేరుశనగ పొలం చుట్టు రక్షక పంటగా సజ్జ/జొన్న పంటలను 4-6 వరసలు
    విత్తినట్లయితే కాండం కుళ్ళు వైరస్ తెగుళ్ళును వ్వాప్తి చేసే రసం పీల్చే పురుగులైన తామరపురుగుల వ్వాప్తిని అరికట్టవచ్చు. వేరు శనగతో సజ్జ/కంది పంటను 7:1/11:1/15:1 నిష్పత్తితో అంతరాపంటగా
    వేయాలి.
  •  రైతులు సాంప్రదాయ పద్దతిలో (నాగలితో) విత్తనం విత్తడం కన్నా
    వ్యవసాయ యంత్రాలు (అనంత విత్తన గొర్రు) ఉపయోగించి విత్తడం వల్ల
    తక్కువ సమయంలో ఎక్కువ విత్తనం విత్తవచ్చు.
  •  రైతులు వేరుశనగ రకాలను ఎంపిక చేసుకొనే సమయంలో బెట్టను తట్టుకొని,
    అధిక దిగుబడినిచ్చే రకాలైన కదిరి -6, కదిరి -9, కదిరి హరితాంధ్రా,
    అనంత, గ్రీష్మా, నారాయణి, అభయ, ధరణి, కదిరి లేపాక్షి,
    టి.సి.జి.యస్-1694 మొదలగు రకాలను ఎంపిక వేసుకోవాలి.
  •  విత్తే సమయంలో కానీ విత్తిన 20-30 రోజులప్పుడు నీటి సంరక్షణ కోసం
    ప్రతి 3.6 మీటర్లకు ఒక తల్లి చాలు ఏర్పాటు చేసుకోవాలి.

పత్తి :
పత్తి విత్తటానికి ఎర్ర నేలల్లో జూన్ మాసం నుంచి జూలై 15, నల్లరేగడి నేలల్లో జులై నుంచి ఆగష్టు 15 వరకు అనుకూలo. ఒక ప్రాంతంలోని రైతులంతా దఫాలుగా కాకుండా ఒకేసారి వీలైనంత స్వల్ప వ్యవధిలో విత్తుకోవాలి. బీటి పత్తి విత్తన మోతాదు ఎకరాకు 0.75 నుంచి 1.0 కిలోలు. బీటి పత్తి చుట్టూ నాన్ బీటి/కంది వేసుకోవడం వల్ల
కాయ తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది. సిఫారసు మేరకు దుక్కిలో ఎరువులు
వేసుకోవాలి. విత్తుకున్న 40 రోజులకు తప్పనిసరిగా ఎకరానికి 4-6 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి.
వరి:
వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరుగా జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలగు పచ్చిరొట్ట పైర్లను తప్పనిసరిగా వేసుకొని నాట్లు వేసే ముందు భూమిలో కలియదున్నాలి.
కంది:
కంది విత్తుకునే రైతులు నేల రకాన్ని బట్టి రకాలను ఎంచుకోవాలి. తేలికపాటి
నేలల కోసం మధ్యస్థ కాలపరిమితి రకాలైన పి.ఆర్.జి.-176, పి.ఆర్.జి.-158,
ఐసిపిఎల్ 84031. బరువు నేలలకు మధ్యస్థ నుంచి ఎక్కువ కాలపరిమితి
రకాలైన ఎల్.ఆర్.జి.-41, ఎల్.ఆర్.జి.-52, ఎల్.ఆర్.జి.-105, టి.ఆర్.జి.-59,
ఐ.సి.పి.ఎల్ 85063, ఐ.సి.పి.ఎల్ 87119 , బి.ఎస్.ఎమ్.ఆర్-786 వంటి
రకాలను వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కేవీకే,వ్యవసాయ శాఖ
నుంచి పొందవచ్చు.
ఆముదం:
ఆముదం విత్తటానికి జూన్ 15 నుంచి జూలై 31 అనుకూల సమయం. ప్రస్తుతం నేలలో అందుబాటులో ఉన్న తేమను వియోగించుకుని దుక్కులు చేసుకోవాలి. కాలానికి, నేలకు, ప్రాంతానికి అనువైన రకాలను వేసుకోవాలి.
సూటిరకాలు: హరిత, కిరణ్, జ్వాల, ప్రగతి.
సంకర రకాలు: డి.సి.హెచ్. 117, పి.సి.హెచ్. 111, జి.సి.హెచ్.8 ఐ.సి.హెచ్. 66 ,  ఐ.సి.హెచ్. 5 రకాలను ఎంపికచేసుకోవాలి.
మామిడి:
మామిడి తోటలలో కోత అనoతరం ఎండుపుల్లలను, అడ్డదిడ్డoగా ఉన్న
కొమ్మలను కత్తిరించి గాలి, వెలుతురు బాగా ప్రసరించే విధంగా చూసుకోవాలి.
సిఫార్సు చేసిన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి.
దానిమ్మ:
ప్రస్తుతం దానిమ్మ చెట్లకు పూర్తిగా విశ్రాంతి నివ్వాలి. బాక్టీరియా తెగులును అదుపులో ఉంచడానికి ఒక శాతం బోర్డోమిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారి చేయాలి.
అరటిలో : ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని మార్చి , ఏప్రిల్ నెలలో నాటిన అరటి మొక్కలకు సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను, దీర్ఘ కాలిక రకాలకు పిలక నాటిన 45, 90, 135,180 రోజులకు అలాగే స్వల్ప కాలిక రకాలకు పిలక నాటిన 40, 80, 120, 160 రోజులకు వేసుకోవాలి.
పశువులు:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఆవులు, గేదేల్లో గాలికుంటూ ,
ఎంటారోటాక్సీమియా, పారుడు రోగం  వ్యాప్తికి అనుకూలం. రైతులు వీటికి
తప్పనిసరిగా టీకాలు వేయించాలి.
డా.జి.నారాయణస్వామి,
సీనియర్ శాస్త్రవేత్త, అనంతపురం

Leave Your Comments

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ

Previous article

వర్షాధార పంటలు సాగుచేసే రైతులు ఈ సూచనలు పాటించండి !

Next article

You may also like