నేలల పరిరక్షణవార్తలు

Types of Soil: నేలల్లో రకాలు.!

0
Types of Soil
Types of Soil

Types of Soil:

ఒండ్రు నేలలు :    ఎతైన  ప్రదేశాల నుండి వర్షపు నీటి ద్వారా నదుల్లో కొట్టుకొచ్చిన  సారవంతమైన  మట్టి మెటలు  వేయగా ఒండ్రు నేలలు ఏర్పడతాయి . ఇవి చాలా లోతుగా, మిక్కిలి సారవంతంగా ఉంటాయి.నీరు సులువుగా పోవడం వలన నేలలో  మురుగు నీరు సమస్య అంతగా ఉండదు.నెలలు  నది తీరాల్లోను డెల్టాలోను ఉంటాయి.

  • నల్ల రెగడి నేలలు :  ఇవి నీటిని ఎక్కువగా పట్టి ఉంచె  శక్తి గల బరువైన నేలలు, వర్షం పడిన తర్వాత నీరు త్వరగా ఇంకదు. నేల త్వరగా ఆరదు , గాలి ప్రసరణ తక్కువ, నేల ఎండినప్పుడు బిటలు పడి దున్నినప్పుడు పెద్ద మట్టి గడ్డ గడ్డలుగా  ఉంటాయి.ఇది పండ్ల సాగుకు పనికి రాదు.
  • గుల్ల రాతి నేలలు : ఇవి గుల్లగా, తేలికగా ఉండే రాతి నేలలు, నీరు సులువుగా ఇంకిపోతుంది. భూసారం  తక్కువ అధిక వర్ష పాతం ఉండే చోట్ల ఆమ్లా గుణం  కలిగి  ఉంటాయి.మన దేశం పశ్చిమ తీరా ప్రాంతాలో ఈ రకం నేలలు ఎక్కువగా ఉన్నాయి. తగినంత ఎరువు వేసి కొబ్బరి, మామిడి,పనస, అనాస, వంటి తోటలను పెంచవచ్చు.
  • ఎర్ర నేలలు :   ఇవి ఇటుక ఎరుపు రంగులో గుల్లగా, తేలికగాను, ఖనిజ లవణాలు తక్కువ గా ఉంటాయి. నేలల తటస్టాంగ  లేదా కొద్దిగా ఆమ్లాత్వంతో ఉంటాయి. అనువైన పంటలు  బత్తాయి, నారింజ,నిమ్మ, ద్రాక్ష
Types of Soil

Types of Soil

  • గరప నేలలుఇవి గోధుమ / బూడిద కొద్దిగా ఎరుపు రంగులో గాని ఉండే తేలిక నేలలు ఇసుక పాలు ఎక్కువగా  ఉంటాయి.తెలంగాణ ప్రాతంలో  దీనిని చల్కా నేలలు అంటారు.మిక్కిలి అనువైన పంట ద్రాక్ష…
  • సేంద్రియ నేలలు  :    అడవుల్లో చెట్ల కింద ఆకు /రెమ్మ /పువ్వు పండి కుళ్ళి ఈ రకమైన నేలలు ఏర్పడతాయి.ఇవి చాలా సారవంతం అయినా నేలలు.మన రాష్టంలో అరకులోయ, రంపచోడవరం వంటి ప్రాంతాలలో ఇలాంటి నేలలు అక్కడక్కడా ఉంటాయి.అనువైన పంటలు కాఫీ, తేయాకు,రబ్బరు,మిరియాలు,దాల్చిన చెక్క…. వీరివీరిగా పండిస్తారు.
  • ఇసుక నేలలు :   నేలలో ఇసుక పాలు ఎక్కువ, నీరు నిలువదు.నీరు, లవణాలు సులువుగా లోపలి పొరల్లోకి జారిపోతాయి. భూసారం తక్కువ అందువల్ల  సాగు నీరు ఎరువులు,ఎక్కువగా వాడాలి.అనువైన పంటలు జీడీ మామిడి,నేరేడు,సపోటా,కొబ్బరి,కుంకుడు, సరుగుడు, మొదలైనవి.

Also Read: Soil Types for Fruits Farming: పండ్ల తోటలకు అనువైన నేలలు.!

Must Wacth: 

Leave Your Comments

Hibiscus For Hair Growth: మందార పువ్వుతో అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్.!

Previous article

kharif Crops Management Practices: అధిక వర్షాల పరిస్థితుల్లో వివిధ ఖరీఫ్ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు.!

Next article

You may also like