Cabbage and Cauliflower Cultivation: శీతాకాలంలో సాగుచేసే కూరగాయల్లో క్యాబేజి, కాలీఫ్లవర్ ముఖ్యమై నవి. ఇవి కూరగాయగా ఏక వార్షికం, విత్తనం కొరకు ద్వివార్షికం. దక్షిణ భారతదేశంలో వీటిని కూరగాయగానే సాగు చేస్తారు. వీటిలో క్యాబేజిని సలాడ్గా కూడా వాడతారు. మన దేశంలోకి వీటిని ఐరోపా దేశస్తులు ప్రవేశ పెట్టినా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పంటలు మనదే శంలో సుమారు 7.74 లక్షల హెక్టా ర్లలో సాగవుతూ 164.2 లక్షల టన్నుల ఉత్పత్తితో క్యాబేజిలో 22.9 టన్నులు, 19.6 టన్నుల ఉత్పాదకత కలిగి ఉన్నాయి.

Cabbage and Cauliflower Cultivation
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5271 హెక్టార్లలో సాగ వుతూ 79,065 టన్నుల ఉత్పత్తితో 15 టన్నుల ఉత్పాదకత కలిగి ఉంది. వీటి విత్తనాల ధర అధికంగా ఉండటం, చీడపీడల సమస్యలు ఎక్కు వగా ఉండటం వల్ల రైతులకు సమగ్ర సస్యరక్షణపై సరైన అవగాహన లేక పోవడం వల్ల పురుగు మందులు విచ క్షణా రహితంగా వాడుట వంటి సమస్యలున్నాయి. తగిన సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేస్తే అధిక దిగు బడులు సాధించవచ్చు.
అనువైన నేల, నేలతయారీ: తగినంత నీటి వసతితోపాటు మురుగు నీటి సౌకర్యం గల నల్లరే గడి నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5.5- 6.5 గాను, పొలాన్ని 3- సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్ని 8-10 టన్నుల పశువుల ఎరువుతో పాటు భాస్వరం, పొటాష్ ఎరువులను వేసి, బోదెలను 60 సెం.మీ. దూరంలో ఉంచాలి.
విత్తన మోతాదు, విత్తన శుద్ధి: వీటిలో సూటి రకాలు, హైబ్రిడ్ రకాలు వాడకంలో ఉన్నాయి. ఎకరానికి సూటి రకాలైతే 280-320గ్రా. హైబ్రీడ్ రకాలైతే 120-180గ్రా. విత్తనం సరిపోతుంది. నల్లకుళ్ళు తెగులుకు విత్తనాన్ని 50డి.సెం.గ్రే. ఉష్ణోగ్రతలో వేడి నీటిలో 30 నిమి షాలు ముంచి ఆరబెట్టి 5గ్రా. ఇమిడా క్లోప్రిడ్, 3గ్రా. కాప్టాన్ చొప్పున కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధిచేసిఎత్తైన నారుమళ్ళపైగాని, ప్రొట్రేలలో గాని విత్తి నారుమడి పెంచాలి.
Also Read: Cauliflower Cultivation: క్యాలిఫ్లవర్ సాగులో మెలకువలు.!
నాటేదూరం, నాటుటలో మెలకువలు: సరైన వయస్సులో నారును ప్రధాన పొలంలో నాటితే బాగా నాటుకొని పంట బాగా పెరిగి ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేసుకుని ఎక్కువ దిగుబడి పొంద వచ్చు. ముదురు నారు నాటితే మొక్క పూర్తిస్థాయిలో పెరగక చిన్న గడ్డ లేదా పువ్వు ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. 21-25 రోజుల వయస్సు నారు మాత్రమే నాటాలి. ఒక కుదురుకు ఒక మొక్క మాత్రమే నాటాలి. పంట కాలపరిమితిని బట్టి వీటిలో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలున్నాయి. తక్కువ కాలపరిమితగల రకాల్లో మొక్కల పరిమాణం తక్కువగా ఉన్నందున గడ్డ లేదా పువ్వు బరువులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక రకాలను ఎక్కువ దూరంలో నాటాలి.
నాటే దూరం-
స్వల్పకాలిక రకాలు: 60X30 సెం.మీ. లేదా 45×45 సెం.మీ. మధ్యకాలిక రకాలు: 60×45 సెం.మీ.
దీర్ఘకాలిక రకాలు: 60X60 సెం.మీ. నారు నాటిన వారంరోజు లోపు చావు నాట్లు వేయాలి.
క్యాబేజిలో రకాల ఎంపిక-
స్వల్పకాలిక రకాలు: 60-70 తే రోజుల పంటకాలంతో గడ్డ బరువు 1.0-2.6 కిలోల వరకుంటుంది. దుగోల్డెన్ ఏకర్, ప్రైడ్ ఆస్ఇండియా, ద పూసాముక్త, కోపెన్ హాగన్
మధ్యకాలిక రకాలు: 80-90 రోజుల కాలపరిమితితో 2-5 కిలోల స వరకు బరువుంటాయి. గ్లోరిఆఫ్ ఎ
దీర్ఘకాలిక రకాలు: 100-120 రోజుల్లో గడ్డ బరువు 3-5 కిలోలుంటుంది. కాలిక పూసాడ్రమ్ హెడ్, లేట్ డ్రమ్డ్.
ఎరువుల యాజమాన్యం: నాణ్యత, నిల్వతో పాటు అధిక దిగుబడులు పొందుటకు సిఫారసు చేసిన ఎరువులను వేయాలి. ఎకరా నికి 8-10 టన్నుల మాగిన పశువుల ఎరువుతో పాటు 60-80 కిలోల భాస్వరం, 40కిలోల పాటాస్ వేయాలి. అజటోబాక్టర్, పాస్పోబాక్టీరియాలను 2 కిలోల చొప్పున వేయాలి. 32 కిలోల నత్రజనిని 2-3 దఫాలుగా నాటిన 30, 60 రోజులకు వేయాలి.ఈ పంటలకు భాస్వరం ఎరువు ఎక్కువ అవసరం ఉన్నందున సూపర్ ఫాస్పేట్ రూపంలో వేస్తే కాల్షియం కూడా లభిస్తుంది. గడ్డ/పువ్వు ఏర్ప డిన తర్వాత ఎరువులను పైపాటుగా వేస్తే ఉపయోగపడవు.

Cauliflower Cultivation
నీటి యాజమాన్యం: ఈ పంటలు శీతాకాలంలో సాగు చేయటం వల్ల తప్పనిసరిగా నీటి యాజమాన్యం పాటించాలి. గడ్డ పువ్వు పెరిగే దశను కీలక దశగా గుర్తించాలి. నేలస్వభావాన్ని బట్టి నల్లరేగడి నేలల్లో 10 రోజులకొకసారి, తేలిక నేలల్లో 6 రోజులకొకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చేముందు నీటిని ఆపేయాలి. నీటినిస్తే గడ్డలు పగిలే అవకాశముంది.
అంతర కృషి: పంట పెరిగే దశలో కలుపు లేకుండా చూడాలి. నాటిన 4-8 గంట ల్లోపు పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 6మి.లీ. చొప్పున కలిపి తడి నేలపై పిచికారిచేయాలి.2-3 సార్లు గొప్పుతవ్వి మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోయాలి. గడ్డ/పువ్వు పరిమాణం ఎక్కువగా ఉన్న రకాల్లో బరువుకు మొక్కలు వాలిపోతాయి. ఈ పంటల్లో పెరిగే భాగం దెబ్బతింటే ఆ మొక్కల్లో గడ్డ పువ్వు ఏర్పడదు. అంతరకృషి వల్ల మొక్కలు పెరిగే భాగానికి ఏవిధమైన హాని కలుగరాదు. మొక్కల మధ్య గడ్డి మరీలోతుగా తవ్వి తీస్తే మొక్కలకు హాని కలుగవచ్చు.
Also Read: Gladiolus Flower Cultivation : గ్లాడియోలస్ సాగు, సస్యరక్షణ.!
Must Watch: