Summer Crops: వేసవిలో ఆరుతడి పంటల సాగుకి సమయం ఆసన్నమైనందున రైతు సోదరులు సాగుకి సిద్ధమవుతున్నారు. సజ్జ, రాగులు, పెసలు, మినుము, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు మరియు అలసంద పంటలు వేసవికి అనుకూలమైనవి. ఈ పంటలలో నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం, అలాగే సరైన విత్తన మోతాదు మరియు విత్తనశుద్ధి తప్పనిసరి. పైన పేర్కొనబడిన పంటల వివరాలు కింద వివరించడం జరిగింది.
సజ్జ:
వేసవిలో సజ్జను ఆరుతడి పంటగా ఫిబ్రవరి రెండవ పక్షంలోపు విత్తుకోవాలి.
విత్తన మోతాదు: ఎకరానికి 15-2.0 కిలోలు అవసరమగును.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 6 గ్రా. మెటలాక్సిల్ 35 ఎస్.డి.తో విత్తన శుద్ది చేసి సచ్చకంకి, వెర్రి తెగులును నివారించవచ్చును. కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
రకాలు: పి.హెచ్. బి-3(హైబ్రీడ్), హెచ్. హెచ్. బి-61 (హైబ్రీడ్), ఆర్.హెచ్.జి – 121 (హైబ్రీడ్), వేసియం. హెచ్ 356 (హైబ్రీడ్) ఏ.సి.టి.పి. 8203 (కాంపొజిట్), ఐ.సి.యం.వి. 221 (కాంపొజిట్), రాజ్ `17 (కాంపొజిట్)
విత్తే దూరం: 7 వరుసల మధ్య 47 సెం.మీ., మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి.
రాగి, తైదలు:
ఈ పంటలో కాల్షియం అత్యధికంగాను, కొవ్వు తక్కువగా ఉంటాయి.
రకాలు: భారతి, శ్రీచైతన్య, హిమ, మారుతి, శారద, గోదావరి మరియు జాంబవతి.
విత్తన మోతాదు: నాటటు వేసే పద్ధతి 2 కిలోల వితం 5 సెంట్లలో పెంచితే ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. వెదజల్లే పద్దతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరమవుతుంది.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 2 గ్రా కార్బండిజంతో విత్తనశుద్ధి చేయాలి.
విత్తేదూరం: వరుసల మధ్య 30 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ. దూరం పాటించాలి.
పెసర, మినుము : ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తుకోవాలి.
రకాలు: పెసర: యం.జి.జి-295, యం.జి.జి- 347, యం.జి.జి248, యం.జి.జి.351, డబ్ల్యు .జి.జి`371, డబ్ల్యు.జి.జి -42, టియం . 96`2, ఐ.పి.యం 2-14
Also Read: మినుముల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
మినుము:
యం.బి.జి- 207, పి.యు- 37, యల్.బి,జి`752, యల్.బి.జ – 787, టి.బి.బి – 104, యల్. బి.జి-20, డబ్ల్యు.బి.జి-26, ఐ .పి.యు-2-43, జి. బి.జి – 1
విత్తన మోతాదు: 6-8 కిలోల ఎకరానికి విత్తుకోవాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. ధమోమిథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసంపీల్చే పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు.
మొదటిసారి పంటకు పొలంలో సాగు చేసినప్పుడు రైజోరియం కల్చర్‌ను విత్తనానికి పట్టించాలి. 200గ్రా. రైజోబియం కల్చర్ ఎకరానికి విత్తనానికి పట్టించాలి. బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి. మొదట శిలీంధ్ర నాశక మందులతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియం విత్తనాలకు పట్టించాలి.
విత్తే దూరం: వేసవి ఆరుతడి వంటగా సాగు చేసినప్పుడు సాలు సాలుకి మధ్య 22.5 సెం.మీ., మొక్కకి మొక్కకి మధ్య 10 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.
అలసంద:
వేసవిలో అలనంద పంటను ఫిబ్రవరిలో విత్తుకోవాలి. రకాలు : బి.సి`3, వి-240, సి-152, కో-4
విత్తన మోతాదు: ఎకరానికి 8- 10 కిలోలు విత్తనం అవసరమగును.
విత్తన శుద్ధి: ప్రతి కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా 20 గ్రా. మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేసుకొని విత్తుకోవాలి. విత్తేముందు ఆఖరిదశలో రైబోబియం కల్చరును పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎండు తెగులు సమస్యాత్మక ప్రాంతాలలో టైకొడెర్మావిరిడి 8 గ్రా. ప్రతి కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
విత్తే దూరం: గుబురు రకాల సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ, బాగా బొమ్మలు వేసి మరియు తీగ రకాలకు సాళ్ల మధ్య 40-60 సెంమీ. మొక్కల మధ్య 15 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.
నువ్వులు:
విసవిలో జనవరి, ఫిబ్రవరి మాసాలలో విత్తుకొని అంత తక్కువ సమయంతో, తక్కువ వనరులతో అధిక నికర ఆదాయాన్ని అర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. వేనవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యద పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు.
రకాలు: స్వేత, హిమ (జి.సి.యస్ – 9426), రాజేశ్వరి, చందన, ఎలమంచిలి – 66 (శారద), గౌరి.
విత్తన మోతాదు: ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని మూడిరతలు ఇసుకలో కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
విత్తన శుద్ధి: కిలోవిత్త నానికి 3గ్రా. మాంకోజెబ్ విత్తన శుద్ధి చేయాలి. పంట తొలిదశలో రసంపీల్చే పురుగుల బారీ నుండి కాపడడానికి ఇఇమిడాక్లోప్రిడ్ 20 మి.లి కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి.
విత్తే దూరం: వరుసల మధ్య 30 సెం.మీ, మురాల మధ్య సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.
పొద్దు తిరుగుడు:
వేసవిలో ఈ పంట జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటి పారుదల కింద సాగుచేసుకోవచ్చు.
రకాలు: టి.ఆర్. ఎస్. హెచ్-1, కె.బి.ఎస్.హెచ్ 44, ఎన్.డి.ఎస్.హెచ్-1
విత్తన మోతాదు: ఎకరాకు 2.5-3 కిలోల విత్తనం అవసరమవుతుంది.
విత్తనశుద్ధి: నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి ధయోమిథాక్సామ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మి.లీ. ఒక కిలో విత్తనానికి, కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్ 25 శాతం G కార్బండిజమ్ 25 శాతం మందును 2 గ్రా. కిలో విత్తనానికి నాడి విత్తనశుద్ధ చేసుకోవాలి.
విత్తేదూరం: తేలిక నేలలో సాళ్ళ మధ్య 20-25 సెం.మీ, నల్ల రేగడి నెలల్లో సాళ్ళ మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. ఈ విధమైన చర్యలు పాటించి మంచి మొలక శాతాన్ని తద్వారా మంచి గణనీయమైన దిగుబడులను సాధించవచ్చు.
డి. స్రవంతి, డా. కె. గోపాలకృష్ణ మూర్తి, డా. కె. శిరిష, డా.పి.నీలిమ,
డా. యం.యం. కాడ సిద్దప్ప, కె. నాగంజలి. మరియు డా. యం. మాధవి.
వ్యవసాయ కళాశాల, ఆశ్వారావుపేట.
Also Read: అపరాల సాగు
Leave Your Comments