Mango Cultivation: ఇరు తెలుగు రాష్ట్రాల్లో పండిరచే పండ్ల తోటల్లో మామిడి ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంది. తెలంగాణలో దక్షిణ మరియు ఉత్తర అధిక విస్తీర్ణంలో సాగు లో ఉన్నాయి. ఈ రకాలు ముందుగా కోతకు రావడం వల్ల దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది.
ఎగుమతి రకాలు:
ఆల్పాన్సో, తోతాపురి, కేసర్, బంగినపల్లి
ప్రస్తుతం మామిడి సాగులో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్ల పూత పిందె మరియు చీడపీడలు ఆశించడం వలన కూడా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రింది జాగ్రత్తలను పాటించి అధిక దిగుబడులు సాధించవచ్చు.
* మామిడి తోటలో చుట్టూ ఉన్న గట్లపైన కలుపు మొక్కలు తీసి దూరంగా పారవేయాలి.
* మామిడి చెట్ల పైన ఉన్న ఎండు కొమ్మలు రెండు పూత రెండు ఆకులు తీసి పారవేయాలి.
ఆకు జల్లెడ గూడు పురుగు: ఈ పురుగులు ఆకులు ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి ఆకుల్ని దగ్గరకు చేసి గూడును ఏర్పరచుకుంటుంది. ఈ పురుగు పూతదశలో పూలను, పూగుత్తులను గూడుగా ఏర్పరుస్తుంది. దీని నివారణకు క్వినాల్‌ఫాస్ మూడు మిల్లీ లీటర్లు లేదా కార్బరిల్ 3 గ్రాములు లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
Also Read: పశువులలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ లోపాల యాజమాన్యం
టెంక పురుగులు: ఈ పురుగులు కాయలు చిన్నగా ఉన్నప్పుడే గుడ్లు పెట్టడం జరుగుతుంది. తరువాత కాయలోకి చొచ్చుకుపోయి టెంకలోకి ప్రవేశిస్తాయి. ఈ రంధ్రం మూసుకుపోయి లోపల పురుగు అభివృద్ధి చెందుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే రకాలలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు కార్బరిల్ 3 గ్రాములు మందు ఒక లీటరు నీటిలో కలిపి పిందె పుట్టిన తరువాత ఒకసారి, నెల తరువాత మరో సారి పిచికారీ చేయాలి. ఇందువల్ల గుడ్లు వాటి నుండి వచ్చే పిల్లలు చనిపోతాయి. టెంకలో పురుగు దూరిన తర్వాత మందు ప్రయోజనం ఉండదు. రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
పండు ఈగ: కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువ లార్వాలు కాయలోని మెత్తని కండను తినడం వలన కాయ మెత్తబడి కుళ్ళి రాలిపోతుంది. దీని నివారణకు రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. చెట్టు కింద దున్ని కోశస్థ దశను బయటకు తీసి వేయాలి. కార్బరిల్ 10 శాతం పొడిని భూమిలో (50 నుండి 100 గ్రాములు / చెట్టుకి కలుపుట). మిథైల్‌యూజినాల్ ఒక ప్లాస్టిక్ పళ్లెంలో రెండు మిల్లీ లీటర్లు మరియు మూడు గ్రాములు కార్భోఫ్యూరాన్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి తోటలో అక్కడ అక్కడ ఉంచాలి. మలాథియాన్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కాయతొలుచు పురుగు: మామిడి పిందెలు గోళీ సైజులో ఉన్నప్పుడు గొంగళి పురుగులు ఆశించి పిందె రాలిపోతుంది. దీని నివారణకు డైక్లోరోవాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ మీటర్లు లేదా వేప నూనె మూడు మిల్లీ లీటర్లు క్లోరిపైరిఫాస్ ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మసి మంగు: ఈ తెగులు కాప్నోడియం అనే శిలీంద్రం ద్వారా వస్తుంది. రసం పీల్చే పురుగులు విసర్జించిన పదార్థంపై ఆకుల మీద పిందెలు మరియు కాయల మీద నల్లటి మంగు పెరుగుతుంది. దీనివల్ల కాయ సైజు తగ్గిపోయి రాలిపోతాయి.
దీని నివారణకు రసం పీల్చే పురుగు ను సమర్ధవంతంగా అరికట్టాలి. మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చెట్లపైన పిచికారీ చేయాలి. ఆకులపైన మసిని తొలగించుటకు రెండు కిలోల గంజి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మూడు నుండి నాలుగు లీటర్ల తెగుళ్లు కనిపించిన భాగాన పిచికారీ చేయాలి. నాలుగు నుండి ఐదు రోజుల తరువాత నీటిని పిచికారీ చేసి ఈ సమస్యను తొలగించవచ్చు.
మచ్చ తెగులు: ఈ తెగుళ్లు ఆశించినప్పుడు గోధుమరంగు మచ్చలు, ఆకులు, పండ్లు, పూల మీద కనపడతాయి. తెగులు ఉధృతంగా ఉంటే పూరెమ్మలు, పిందెలు రాలిపోతాయి. కాపు బాగా తగ్గుతుంది. మరియు పండ్లు కుళ్ళిపోతాయి.
దీని నివారణకు ఎండుకొమ్మలు తీసివేసి లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. లేదా ఒక గ్రాము కార్బండిజమ్ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
డా.జి. జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (హార్టీకల్చర్)
డా. కె. వెంకటలక్ష్మి, డా. నిర్మల,అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం.
Leave Your Comments