ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడి, అత్యధిక పోషకవిలువలున్న కొత్త వంగడాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.ఆదివారం (ఆగస్టు 11 న) న్యూ ఢిల్లీలోని ఇండియా అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, పూసాలో 61 పంటల్లో 109 కొత్త రకాలను విడుదల చేశారు. ఈ పంట రకాల అధిక దిగుబడి, వాతావరణ అనుకూలత, ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండేలా రూపొందించబడ్డాయి.
పంట రకాలను ఆవిష్కరించేటప్పుడు, ప్రధాన మంత్రి రైతులు, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యవసాయంలో విలువ ఆధారిత చర్యల ప్రాముఖ్యతను, సేంద్రియ వ్యవసాయం, చిరు ధాన్యాల ప్రాధాన్యం గురించి స్పష్టం చేశారు. ఈ కొత్త రకాల వల్ల తమ ఖర్చులు తగ్గిపోతాయని, పర్యావరణానికి మేలు చేకూరుతుందని రైతులు నమ్మకం వ్యక్తం చేశారు.
శాస్త్రవేత్తల కృషి, ఆవిష్కరణలను ప్రధాన మంత్రి అభినందించారు.
ఆవిష్కరించిన ఈ 109 కొత్త వంగడాలు 34 క్షేత్ర పంటలు (ఫీల్డ్ క్రాప్స్), 27 ఉద్యాన పంటల్లో ఉన్నాయి. ఇవి భారత వ్యవసాయ ఉత్పాదకత, స్థిరత్వాన్ని పెంచడంలో ఒక కీలక ముందడుగుగా గుర్తించబడ్డాయి.
Leave Your Comments