Jasmine Cultivation: మల్లె ఓలియేసియే కుటుంబానికి చెందినది. మన రాష్ట్రంలో మల్లెను వివిధ రకాల ఉపయోగాల కొరకు పొదగా లేదా తీగ రకాలుగా సాగు చేస్తున్నారు. పువ్వులు మరియు మొగ్గలను పూలదండలు, పుష్పగుచ్ఛాలు తయారీతో పాటు వివిధ సామాజిక వేడుకల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. మల్లె నూనెను సుగంధ పరిమళాల తయారీతో వాడుతున్నారు.
వాతావరణం:
మల్లెసాగుకు తేలికైన ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తక్కువ చలి మరియు కాంతివంతమైన వేసవిలో సరిపడా తేమను అందించగల ప్రాంతాలు అనుకూలం.
నేలలు:
మల్లెను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు.
రకాలు:
జాస్మినమ్ సాంబంక్, జాస్మిన్ గాంఢఫోరమ్, జాస్మిన్ ఆరిక్యులేటమ్, జాస్మినమ్ సాంబాక్ గుండు మల్లె. ఈ పూలను విడిపూల దండల తయారీలో వాడుతున్నారు. రామ్‌బాన్, మదనబాన్, సింగిల్ మోగ్రా, డబుల్ మోగ్రా, కస్తూరి మల్లె, సూజిమల్లె మొదలగు రకాలున్నాయి. జాస్మినమ్ ఆరిక్యులేటమ్‌ను విడిపూల ఉత్పత్తి కొరకు ఉపయోగిస్తున్నారు.
ప్రవర్ధనం:
అంటుకట్టుట మరియు కొమ్మ కత్తిరింపులు
Also Read: మల్లె సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు..
నాటడం: మొక్కలను నాటడానికి 45 నుండి 90 సెంటీమీటర్ల గుంతలను తీసి ఒక్కో గుంతకు 10 నుండి 15 కిలోల ఎరువు, 50 గ్రాముల ఫాలిడాల్ పొడిని పొడిని కలపాలి. మల్లెను సాధారణంగా జూలై నుండి సెప్టెంబర్ వరకు నాటుకోవచ్చు. జాస్మినమ్ ఆరిక్యులేటమ్ 1.8 I 1.8 మీటర్లు జాస్మిన్ సాంబాక్ 1.2I1.2మీటర్లు జాస్మినమ్ గ్రాండిఫోరమ్ 2I1.5 మీ. దూరంలో నాటుకోవాలి. నాటిన తరువాత జాస్మినమ్ ఆరిక్యులేటమ్‌లో ప్రతిమొక్కకు 60 గ్రా. నత్రజని, 120 గ్రా. భాస్వరం, 120 గ్రా. పొటాష్, జాస్మినమ్ గ్రాండిఫ్లోరమ్‌లో మొక్కకు 100 గ్రా. నత్రజని, 150 గ్రా. భాస్వరం, 100 గ్రా. పొటాష్ జాస్మినమ్ సాంబాక్‌లో మొక్కకు 90 గ్రా. నత్రజని, 120 గ్రా. భాస్వరం, 240 గ్రా. పొటాష్‌ను ఇవ్వడం ద్వారా పూలు త్వరగా వస్తాయి.
నీటి యాజమాన్యం:
నేలలో తేమ శాతం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి.
కొమ్మ కత్తిరింపులు: మల్లెలో పూలు లేత చిగుర్ల నుండి ఏర్పడతాయి. కాబట్టి కొమ్మ కత్తిరింపులు శాఖీయ పెరుగుదల నియంత్రణ, శాఖీయ మొగ్గలుగా మారడానికి మరియు పూల ఉత్పత్తికి దోహదపడుతుంది. కొమ్మ కత్తిరింపులకు ముందు మొక్కకు నీరు ఇవ్వకుండా గత సంవత్సరం పూకొమ్మలు, తెగులు సోకిన మరియు ఎండుకొమ్మలను కత్తిరించి తీసివేయాలి. ఆ తరువాత మొక్క ఆకులను ఆకులను కూడా తీసివేయాలి. కత్తిరింపులు అయిన వెంటనే కొమ్మ చివర్లను కాపర్ సంబంధిత శిలీంద్ర నాశినితో శుద్ధిచేయాలి. మల్లెతోట అంతా ఒకేసారి కత్తిరింపులు చేయకుండా కొద్దిగా వ్యవధినిస్తూ నవంబరు చివరి వారం నుండి జనవరి మధ్య వరకు చేస్తే ఎక్కువ రోజులు పూలను పొందవచ్చు.
కోత:
నాటిన మూడవ సంవత్సరం నుండి దిగుబడి మొదలై 10`12 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. జాస్మినమ్ ఆరిక్యులేటర్ 1.8`3.6 టన్నులు / ఎకరానికి జాస్మినమ్ సాంబాక్ 1`2 టన్నులు / ఎకరానికి దిగుబడి వస్తుంది.
డా. ఎమ్. వెంకటేశ్వరరెడ్డి, డా. ఎమ్. విజయలక్ష్మి,
కె. చైతన్య, డా. ఎ. నిర్మల, కె. నిరోషా,
డా. జి. జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పిజెటిఎస్‌ఎయు, యస్‌కెఎల్‌టి, యస్‌హెచ్‌యు, రాజేంద్రనగర్, హైదరాబాద్
Also Read: మల్లె సాగులో మెళుకువలు..
Leave Your Comments