Pest Problem in Guava Plantation: జామ అన్ని కాలాల్లో తక్కువ ధరకే దొరికి, అన్ని వయస్సుల వారూ తినగలిగే పండు. దీనిని పేదవాని అపిల్ అని పిలుస్తారు. ఇన్ని సుగుణాలున్న జామను తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పరంగా సాగుచేస్తున్నప్పటికీ అశించిన దిగుబడులు రాకపోవడంలో చీడపీడలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. జామ పంటను ఆశించి, నష్టపరచే పురుగుల్లో అతి ముఖ్యమైనవి తేయాకు దోమ (టీ దోమ), పండు ఈగ పురుగులు.
తేయాకు దోమ(టీ దోమ) : పంటను వివిధ దశల్లో ఆశించి, నష్టపరచే పురుగుల్లో టీ దోమ అతి ముఖ్యమైనది. తల్లి, పిల్ల పురుగులు టీ, కాఫి, రబ్బరు, జీడిమామిడి వంటి ఉద్యాన పంటలను ఆశించి నష్టపరుస్తాయి.ఏపీలో జీడిమామిడి, జామ తోటల్లో ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది. తల్లి పురుగులు పెద్ద చీమ పరిమాణంలో ఎర్రని కడుపుతోనూ, పిల్ల పురుగులు ఆకుపచ్చని రంగులోనూ ఉంటాయి. ఇవి ఆకుల కాడలు,పెరుగుతున్న లేత కొమ్మలు, పిందెల నుంచి సూదుల వంటి నోటి భాగాలతో గుచ్చి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల పిందెలపై చిన్నచిన్న బుడిపెలు ఏర్పడతాయి. మొక్కలు గిడసబారిపోతాయి.ఈ బుడిపెలు తోలిదశలో ఆకుపపచ్చగా ఉన్నప్పటికీ తరువాత ఎండిపోయి పోలుసుల మాదిరి తయారవుతాయి. కాయ పరిమాణం తగ్గి ఆకారం మారుతుంది. కాయలకు గిట్టుబూటు ధర రాదు.
పండు ఈగ:
ఉదా పసుపురంగులో ఉన్న పండు ఈగలు పెరుగుతున్న కాయలపై గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి చిన్న పిల్ల పురుగులు కాయలలోకి తోలుచుకొని పోయి, లోపలి కండను తింటాయి.
దీని వల్ల కండరంగు, పండు మరిమాణం కూడా మారిపోతుంది. పండ్ల నుంచి దుర్వాసన వస్తుంది. పండ్లు తినటానికి పనికి రావు.
పురుగుల ఉనికి తెలుసుకోవడం ఎలా?
* టీ దోమ తల్లి, పిల్ల పురుగులు పంటపై ఉదయం లేదా సాయంకాలంలో కన్పిస్తాయి. అంతేకాకుండా కాయలపై ఏర్పడిన బుడిపలను బట్టి కూడా పురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయవచ్చు.
* పంటలో ఆకులపై కన్పిస్తున్న పసుపు ఊదా రంగు మిళితమైన పండు ఈగ పురుగులను బుట్టి అక్కడక్కడ పురుగులు ఆశించి, రాలిపోయిన పండ్లను బట్టి పురుగు ఉనికిని తెలుసుకోవచ్చు.
Also Read: Integrated Plant Protection in Chilli Crop: మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ
యాజమాన్యం:
* జామ, జీడిమామిడి తోటలు పక్కపక్కనే ఉంటే తేయాకు దోమల ఉధృతి అధికంగా ఉంటుంది.
* ఐదేళ్లు దాటిన చెట్టుకు ప్రతి సంత్సరం సుమారుగా ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎరువును మూడు దపాలుగా వేసుకోవాలి.
* దోమలకు ఆవాసం కల్పించే కలుపు లేకుండా జాగ్రత్త పడాలి.
* సరైన సయయంలో కొమ్మల కత్తిరింపులు చేసి, చెట్లకు గాలి, వెలుతురు తగిలేట్లు చూసుకోవాలి.
* డై క్లోరోవాస్ ఒక మి.లీ.లేదా మలాథియాన్ 2.0 మి.లీ./ లీటరు నీటికి కలిపి 7-10 రోజులు వ్వవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
* తోట చుట్టూ కంచెలో వేప, జీడిమామిడి చెట్లు ఉన్నట్లయితే వాటి మీద కూడా పురుగు మందులు పిచికారీ చేయాలి.
* పురుగు ఆశించి రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
* చెట్ల పాదుల్లో మట్టిని తరచూ కలియబెట్టాలి. తద్వార పిల్ల పురుగులు, కోశస్థ దశలను నివారించవచ్చు.
* పంట పక్వానికి రాకముందు నుంచి అంటే కాయ తయారయ్యే దశ నుంచి మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరానికి 8 చొప్పున అమర్చి పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. మిథైల్ యూజినాల్ 2 మి.లీ.,మలాథియాన్ 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి దానికి 100గ్రా.బెల్లం కలిపిన ద్రావణాన్ని తయారుచేసి దాన్ని వేడల్పుగా ఉన్న మట్టి / ప్లాస్టిక్ పాత్రలో పోసి, పొలంలో అమర్చినట్లయితే పుల్లని వాసనకు పురుగులు ఆకర్షితమై, ఆ పాత్రలొ పడి చనిపోతాయి.
గమనిక:
* పక్వానికి వచ్చిన కాయలను కోసిన తర్వాత పురుగు మందులను పిచికారి చేయాలి.
* పిచికారి చేసిన తర్వాత కనీసం వారం,పది రోజుల వరకు కాయలు కోయరాదు.
డా. ఎస్. దయాకర్, కోఆర్డినేటర్,
డా. ఏ.ఎస్.ఆర్.శర్మ,ప్రధాన శాస్త్రవేత్త
ఏరువాక కేంద్రం, పెద్దాపురం.
ఫోన్: 9440336752
Also Read: PJTSAU: భారీ వర్షాల నేపథ్యంలో వివిధ పంటల సంరక్షణ-సూచనలు