ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Organic Farmer Kavita Success Story: నిరంతర ఆదాయంతో నిత్యావసరాలకు భరోసా. నెలకు 20 వేల ఆదాయం

0
Lady Farmer Success Story
Kavita

ఏటీఎం వివరములు

పంట రకాలు : 31
వేరుశనగ,టొమాటో,వంగ,బెండ,చిక్కుడు,అనప,కాప్సికం,మిరప,బంతి,ఆముదం,బీర,కాకర,బీట్రూట్,గోంగూర,సపోటా, సన్ ఫ్లవర్, గెనుసుగడ్డ,క్యాబేజీ,చెరకు,అరటి, కనకాంబర పూలు, అవిస, కంది,సీతాఫలం,అల్లనేరేడు,ఉచ్ఛికాయ,బెంగళూరు వంకాయ,సొర, గుమ్మడి,వెల్లుల్లి .

Lady Farmer Success Story

Kavita

నమూనా ఆరంభం : 14th September 2023

ఆదాయ వ్యయ వివరాలు

ఖర్చు: రూ 4800.00 లు
ఆదాయం : రూ 1,28,000.00 లు
ఏ గ్రేడ్
పంట రకాలు : 22
ఖర్చు : రూ 14,500 లు
ఆదాయం : రూ 54,000.00 లు
ఆశిస్తున్న అదనపు ఆదాయం : రూ 45000.00

ఆచరించిన పద్ధతులు

• డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటి సరఫరా
• రిలే క్రాపింగ్ అనుసరణ
• లైవ్ మల్చింగ్ విధానంలో వ్యవసాయం
• వ్యవసాయ వ్యర్థాలతో నేలను కప్పి ఉంచడం
• నిర్ణీత వ్యవధిలో ఘన, ద్రవ జీవామృతం మాత్రం వినియోగించాము

మార్కెటింగ్ విధానం

 కవిత వ్యవసాయ విధానాలను, రుచిని పరిశీలించి ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు కవిత వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తి అయిన ఆకుకూరలు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ లు,
ఏఎన్ ఎమ్ లు, పంచాయత్ రాజ్ సిబ్బంది తదితరులు కొనుగోలు చేస్తున్నారు.
 కవిత వ్యవసాయ క్షేత్రంలో పెరిగే అరుదైన ఉచ్ఛికాయ పంట ఉత్పత్తులను మందుల తయారీ కోసం తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చి కొంటున్నారు.
 కవిత స్థానిక మార్కెటింగ్ కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం వలన కలిగిన ప్రయోజనాలు
• సపోటా పంట దాదాపు పూర్తిగా ఎండిపోవడంతో దున్నివేయాలి అనుకొన్నాను. కానీ ఘన, ద్రవ జీవామృతం కారణంగా సపోటా పంట తిరిగి పుంజుకొంది.
• వివిధ రకాల పక్షులు, తూనీగలు, సీతాకోకచిలుకలు వ్యవసాయ క్షేత్రంలో దర్శనమిస్తున్నాయి
• ఏటీఎం విధానం వల్ల నిరంతర ఆదాయం కలుగుతోంది. తద్వారా ఎప్పటికప్పుడు అవసరాలకు డబ్బు అందుతోంది.
• ప్రతి వారానికి ఒకసారి పంట కోత చేస్తున్నాం. ప్రతి కోతలో 4 వేల రూపాయల ఆదాయం సమకూరుతోంది. నెలకు 20 వేల రూపాయల ఆదాయం కలుగుతోంది.

Lady Farmer Success Story

Kavita

ఆదాయం ఇంకా వస్తోంది

• నేల సారూప్యంలో ఎంతో మార్పు కనిపిస్తోంది
• కుటుంబంలో కూడా వృద్ధ వయసు వారికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యరీత్యా ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది
ఏ గ్రేడ్ కంటే ఏటీఎం మేలు – కవిత, రైతు శాస్త్రవేత్త
“రీ సోయింగ్ లో ఘన జీవామృతం మాత్రమే అవసరం అవుతోంది. కేవలం విత్తనాల కోసమే డబ్బు అవసరం అవుతోంది. ఇంటి కోసం ఏమీ కొనవలసిన అవసరం రావడం లేదు. అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు మా సొంత పొలంలోనే లభిస్తున్నాయి. కుటుంబమంతా పలు రకాల రసాయన రహిత పౌష్టికాహారం తీసుకోగలుగుతున్నాము. నా అనుభవంలో ఏ గ్రేడ్ కంటే ఏటీఎం నమూనా లోనే అధిక ప్రయోజనాలు కలుగుతున్నాయి”

Leave Your Comments

Krishnamurthy Success Story: ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణమూర్తి

Previous article

Meerabi Success story: కేడర్ పేరుతో ఉద్భవించిన మోడల్

Next article

You may also like