ఆంధ్రప్రదేశ్మత్స్య పరిశ్రమవార్తలు

Minister Atchannaidu: వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు

0

Minister Atchannaidu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, మత్స్య శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల ముఖ్య కార్యదర్శులు రాజశేఖర్, అహ్మద్ బాబు, ఇతర అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు.

Minister Atchannaidu

Minister Atchannaidu

* ముంపు, వరద, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రంతాలకు తరలించేందుకు మత్స్యకారుల బోట్ల సహాయం తీసుకోవాలని మంత్రి సూచించారు. పల్లపు ప్రాంతాల్లో పంట నష్టం నియంత్రించేందుకు, ఉద్యాన పంటల్లో నష్టం పెరగకుండా క్షేత్ర స్థాయిలో సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి సూచనలివ్వాలని ఆదేశించారు.

* మత్స్యకారులు రాష్ట్రంలో ఎక్కడా వేటకు వెళ్లద్దని, అందుకు అనుగుణంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంతాల్లో పడవల ద్వారా సురక్షిత ప్రాంతాల్లోకి చేర్చాలని తెలిపారు.

Also Read:Rice Crop: రైతులు తమ వరి పంటను ఎలా సంరక్షించుకోవాలి ?

* రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం పెరగకుండా పంటల ఆధారంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

* ఆక్వా రైతులకు మత్స్య శాఖ అధికారులు తక్షణ సూచనలివ్వాలని, మత్స్య సంపద పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేపలు, రొయ్యల చెరువులకు భారీ వర్షాల ముప్పు వాటిల్లకుండా చర్యలతో పాటు రైతులకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు.

* మత్స్య శాఖ తీర ప్రాంతాల్లో, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న మంత్రి ఆదేశాలతో తక్షణమే 12 కాల్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

Also Read:Natural Farmer Annapurna Success Sory: 2 ఎకరాలు … 2.5 నెలలు …1.52 లక్షల నికర ఆదాయం

* వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్రాప్ డామేజ్ అంచనా వేసేందుకు, రైతులకు సూచనలు ఇచ్చేందుకు ఆదివారం సైతం అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

Leave Your Comments

Horticultural crops: ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులకు ప్రత్యేక సలహా !

Previous article

PJTSAU:సెప్టెంబర్ 3 న జయశంకర్ వర్సిటీ పదో వ్యవస్థాపక దినోత్సవం

Next article

You may also like